— రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్
Justice Shameem Akhtar : ప్రజా దీవెన, నల్లగొండ: చిన్నారులు కష్టపడి చదివి జీవితంలో మంచి స్థానంలోకి రావాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ష మీం అక్తర్ అన్నారు.శనివారం అ యన నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ లో ఉన్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ను వారి శ్రీమతి గజాల అంజుమ్ అక్తర్ తో కలిసి సంద ర్శిం చారు. చైల్డ్ కేర్ సెంటర్ లోని చిన్నా రులను ఉద్దేశించి చైర్మన్ మాట్లాడా రు.
జీవితం ఘర్షణలతో కూడుకొని ఉ న్నదని, ప్రతి ఒక్కరు కష్టపడి చది వితేనే ముందుకు వెళ్తారని, ము ఖ్యంగా పిల్లలు తప్పనిసరిగా చ దువుకోవాలని అన్నారు. చదువు కునెందుకు ప్రభుత్వం అనేక అ వ కాశాలు, సౌకర్యాలను కల్పిస్తున్న దని వాటిని సద్వినియోగం చేసు కోవాలని, భారత రాజ్యాంగం చ దు వుకునే హక్కును కల్పించిందని అ న్నారు.
గొప్పవారు కావాలనే పట్టుదల, సం కల్పం తో చదువుకోవాలని, ఎవరి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుం దని, అప్పుడే సమాజంలో గౌర వం గా బ్రతకగలుగుతామని తెలిపారు. దాతల సహకారంతో చారుమతి చై ల్డ్ కేర్ సెంటర్ ను నడిపిస్తున్న ని ర్వాహక అధ్యక్షులు నాగ సేనారెడ్డి ని ఆయన అభినందించారు. ఈ కేం ద్రం ద్వారా 500 మందిని చదివించి అభివృద్ధి చేయడం, 43 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా చైల్డ్ కేర్ సెంటర్ లోని పని చేస్తున్న వారిని ఆయన సన్మానించారు.
చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ వ్య వస్థాపక అధ్యక్షులు నాగసేనారెడ్డి మాట్లాడుతూ 2005 సంవత్సరం లో ప్రారంభించిన చారుమతి చైల్డ్ కేర్ సెంట్రల్ ద్వారా ఇప్పటివరకు 500 మందికి చదువులు నేర్పించి వారిని పెద్దవారిని చేయడం జరిగిం దని, అందులో చాలా మంది ఉద్యో గాలు చేస్తుండగా, మరి కొంతమంది వివిధ ప్రొఫెషన్లలో స్థిరపడ్డారని తె లిపారు. దాతలు,స్నేహితులు, ఇత రుల సహాయంతో ఈ కేంద్రాన్ని ని ర్వహించడం జరుగుతున్నదని తె లిపారు.
సిడబ్ల్యుసి చైర్మన్ కృష్ణ, జిల్లా సం క్షేమ అధికారి కృష్ణవేణి, తదితరు లు మాట్లాడారు. జిల్లా బార్ అ సోసియేషన్ అధ్యక్షులు కట్టా అనంత రెడ్డి, ఎల్ఐసి పాలసీ దా రుల అసోసియేషన్ జనరల్ సెక్ర టరీ కట్ట వెంకటరెడ్డి, సి డబ్ల్యూసి స భ్యులు వెంకన్న, డిపిసి సభ్యులు గ ణేష్, సిడిపిఓ నిర్మల, మేనేజర్ శ్రీల త, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.