*దాతలను అభినందించిన ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు
Chairman Nagubandi Ranga : ప్రజా దీవేన, కోదాడ:ఆధ్యాత్మిక దాతృత్వాలు పుణ్య కార్యాలని కోదాడ రామాలయం ఆలయ కమిటీ చైర్మన్ నాగు బండి రంగా మరియు అడ్లూరు శివాలయ గుడి నిర్వాహకులు పింగళి నర్సిరెడ్డి అన్నారు బుధవారం కోదాడ పట్టణం పింగళి అమూల్య వీధికి చెందిన ప్రముఖ ఎన్నారై నారప రాజు లక్ష్మీనారాయణ పింగళి అమూల్య కూతుర్లు హర్షిని, మేఘన లు కోదాడ రామాలయం అభివృద్ధికి 1 లక్ష,53 వేల రూపాయల విరాళం అందజేసిన సందర్భంగా దాతలను అభినందిస్తూ మాట్లాడారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉండి అమెరికాలో స్థిరపడి జన్మభూమి కోదాడకు ఏదో ఒకటి చేయాలని సంకల్పంతో దాచుకున్న డబ్బులను ఆలయానికి విరాళం అందజేసిన హర్షిని మేఘన అభినందనీయుల అని పలువురు కొనియాడారు.
వారిని ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది ఆలయ అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు అదేవిధంగా అడ్లూరులో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి1 లక్ష యాభై మూడు వేల రూపాయలు దేవాలయ నిర్వాహకులు పింగళి నర్సిరెడ్డికి అందజేశామని దాతలు నారపరాజు లక్ష్మీనారాయణ పింగళి అమూల్య తెలిపారు అమెరికాలో స్థిరపడి తన సొంత పుట్టిన ఊరు కోదాడ లోని దేవాలయాల అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ఆలయ నిర్వాహకులు సభ్యులు పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో భవాని నగర్ విరాళాల కమిటీ సభ్యులు సేకు రమేష్ బండారు శ్రీనివాసరావు జూలూరు బసవయ్య సిరంగి నరసింహారావు గరిడేపల్లి లక్ష్మణరావు అవినాష్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు