Challa Vamsichand Reddy : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: ఏఐసీసీ ఎనిమిది మంది సభ్యులతో నూ తనంగా ఏర్పాటు చేసిన అత్యు న్నత ఎన్నికల నిపుణులు, సాధి కారిత కమిటీలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు లభిం చిం ది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగో పాల్ నుంచి ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ ఈగల్ కమిటీలో తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం కల్పించగా అది వంశీచం ద్ రెడ్డికే దక్కింది. స్వేచ్ఛ, న్యాయ పూర్వక ఎన్నికలను పర్యవేక్షిం చేం దుకు ఈ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది.
ఇప్పటికే సీడ బ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానిత సభ్యు నిగా కొనసా గుతున్న వంశీచంద్ రెడ్డికి ఈగల్ కమిటీలో మరో అవ కాశం రావడం పట్ల కల్వకుర్తి ని యోజకవర్గ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకు లభిం చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా, సమర్థవంతంగా నిర్వహిస్తానని వంశీచంద్ రెడ్డి తెలిపారు.