–ఒక్క ఏపీకి మాత్రమే కాదు కదా
–బడ్జెట్‌లో ఏపీ, బీహార్ మినహా మిగిలిన రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిం దేమీ లేదు.
— ఢిల్లీ మీడియా సమావేశంలో మండిపడిన టీ కాంగ్రెస్ ఎంపీలు
Chamala Kiran Kumar Reddy:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభు త్వం (Central Govt)ప్రవేశపెట్టిన బడ్జెట్-2024లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపు లు లేకపోవడంతో టీ కాంగ్రెస్ నేత లు మండిపడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, బీహార్ మినహా మిగి లిన రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని, అది కేంద్ర బడ్జెట్ కాదని ఏపీ, బీహార్ బడ్జెట్ (AP and Bihar Budget)అని ఇప్పటికే తెలంగాణ నేతలు విమర్శలు గు ప్పించారు. తెలంగాణకు తీవ్ర అ న్యాయం జరిగిందని నాగర్ కర్నూ ల్ లోక్‌సభ ఎంపీ మల్లు రవి, చామ ల కిరణ్ కుమార్ రెడ్డిలు అన్నా రు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ లను కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్ర మే అమలు చేసేలా బడ్జెట్‌లో హామీ లు, కేటాయింపులు ఉన్నాయ న్నా రు. తెలంగాణలోని పాత జిల్లా ల లో 9 జిల్లాల కు వెనుకబడిన ప్రాం త నిధులు ఇస్తామని హామీ ఇచ్చి దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదన్నారు.
తెలంగాణకు బడ్జెట్‌లో (Budget for Telangana)జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని మోదీ (modi), కేంద్ర ఆర్ధి కశాఖ మం త్రి నిర్మలా సీతారామన్‌కి లేఖలు రాశామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులను మేము వ్యతిరే కించడం లేదు కానీ తెలంగాణకు కేటాయింపులు జరపమని కోరుతు న్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ బీజెపీతో (bjp) రాజీపడిం దన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భం గా తెలంగాణకు జరిగిన అన్యా యాన్ని లేవనెత్తుతామ న్నారు. తెలంగాణకు న్యాయం జరిగేంత వరకు పార్లమెంట్‌లో పోరాటం చేస్తామని మల్లు రవి అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణ కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందు కు ఢిల్లీ వేదికగా ధర్నా చేద్దామని ఎంపీ సురేష్ షెట్కర్ తెలిపారు. కేసీఆర్ వస్తే, రేవంత్ రెడ్డి కూడా వస్తారన్నారు. జంతర్ మంతర్ లో ధర్నా చేసి కేంద్రాన్ని నిలదీద్దామని తెలిపారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా ధర్నా కు కలసి రావాలని సురేష్ షెట్కర్ పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారని భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ న్యాయం జరగలేద న్నారు. విభజన చట్టం 2014లో ఉంటే అప్పటి నుంచి లేని కేటాయిం పులు ఈసారి బడ్జెట్‌లోనే ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రధాని కుర్చీ కాపాడుకునేందుకే బడ్జెట్‌లో నితీశ్, చంద్రబాబు రాష్ట్రాలకు న్యాయం చేశారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపా రు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలు తెలంగాణకు జరిగిన అన్యాయం పై పోరాటం చెయ్యాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy)తెలిపారు.