Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandrababu: ఆదివాసీలది అందమైన జీవనశైలి

–ఆదివాసీ దినోత్సవ సందర్భంగా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు

Chandrababu:ప్రజా దీవెన అమరావతి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), మంత్రులు లోకోష్ (Lokosh) అచ్చెన్నాయుడు (Achchennaidu)శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)నాయు డు స్పందిస్తూ ‘‘జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాము లు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటని పేర్కొన్నారు. అందుకే నాటి తెలు గుదేశం హాయంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశాం. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అం దించామని, అరకు కాఫీకి, గిరి జన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకోసం ప్రోత్సాహాన్ని అం దించాం. గిరిజన జాతులను కాపా డుకోవడం అంటే భారతీయ సం స్కృతిని సమున్నతంగా నిలబెట్ట డమేనని రాబోయే రోజుల్లో కూడా గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని, గిరిజ నులకు, వారి బిడ్డలకు మంచి భవి ష్యత్‌ను అందిస్తామని తెలియజే స్తున్నామoటూ సీఎం చంద్రబాబు (Chandrababu) ట్వీట్ చేశారు.

ఆదివాసీలు స్వచ్ఛ మైన మనసులని, ప్రకృతిని ప్రేమిం చే మనుషులని, సమాజానికి ప్రకృ తి సంపద పంచడమే తప్ప తిరిగి ఏమీ ఆశించని ఆదివాసీలు వ్యక్తి త్వం నిత్యస్ఫూర్తి అని ప్రపంచ ఆది వాసీ దినోత్సవం సందర్భంగా గిరిజ న సోదరసోదరీమణులకు తన శు భాకాంక్షలు అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ‘‘వారు అడవితల్లి బిడ్డలని, అటవీ ఉత్పత్తులే ప్రధాన జీవనాధారం. ఎంత కష్టమైనా చెద రని ఆత్మవిశ్వాసం వారి సొంతమని కాగా తరాలు మారుతున్నా ప్రభు త్వాలు, పాలకులు మారుతున్నా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. కనీస రహదారులు లేక సక్రమంగా వైద్యసేవలు అందకే… ఇప్పటికీ ఎన్నో గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లా కు ఐటీడీఏ సైతం దూరమైన దుస్థి తి నెలకొంది. సబ్‌ప్లాన్‌ నిధులు దా రి మళ్లడంతో అభివృద్ధి కను మరు గైంది. ప్రస్తుతం కూటమి ప్రభు త్వ మైనా తమ అభివృద్ధిపై దృష్టి సా రించేలా చర్యలు చేపట్టాలని గిరి జనం వేడుకుంటోందoటూ లోకేష్ (lokesh) ట్వీట్ చేశారు.

అచ్చెన్న శుభాకాంక్షలు…

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖా మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు (Achenna Yudu) శుభాకాంక్షలు తెలిపారు. గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తి తో ఆదివాసీల సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. ఆదివాసీల సంస్కృతికి నిదర్శన మైన ‘ఆదివాసీల భాష’ను సంర క్షించి సవర భాషకు లిపిని నిక్షిప్తం చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి స్ఫూర్తితో ఆదివాసీల సంప్ర దాయాలను కాపాడేందుకు కృషి చేస్తామని అచ్చెన్నాయుడు అన్నా రు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు హృద యపూర్వక శుభాకాంక్షలు తెలి యజేశారు.

ప్రత్యేక జీవనశైలి ఆదివాసీల సొంతం… ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన బిడ్డలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (sharmila) శుభాకాంక్షలు తెలిపారు. అపురూపం ఆదివాసి సంస్కృతి అని కొనియాడారు. సంప్రదాయాలు, కట్టుబాట్లతో జీవనం.. విలక్షణమైన ఆహార్యం.. గొప్ప ఐక్యత, అడవితల్లి ఒడిలోనిత్యం ఒదిగి సాగే పయనం.. ఇలా ప్రత్యేక జీవనశైలి ఆదివాసీల సొంతమన్నారు. తమ సంస్కృతిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. భవిష్యత్తుపై కోటి ఆశలు పెట్టుకుని, మనుగడ సాగిస్తున్న అడవి బిడ్డల జీవితాలపై నేటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని వెల్లడించారు. కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోని గిరి పల్లెలు, సంపూర్ణంగా అందని సంక్షేమ, అభివృద్ధి ఫలాలు, దయనీయంగా కొనసాగుతున్న గిరిజనుల జీవనం,కాలినడకలు.. డోలీ మోతలు.. విద్య, వైద్యం, రోడ్లు, రవాణా అంతంతమాత్రం. ఇది మన రాష్ట్రంలో గిరిజనాభివృద్ధి అంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారు.