Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandrababu Naidu: బండరాళ్ళ కింద తెల్లారిన బతుకులు

–కొండచరియల విరిగిపడిన ఘట నలో నలుగురు మృత్యువాత
— ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాం తి, పరిహారం ప్రకటన

Chandrababu Naidu: ప్రజా దీవెన, విజ‌య‌వాడ: భారీ వర్షాల కారణంగా విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ (Sunnapubatti Centre) వద్ద ఈ ఉదయం విరిగి ప‌డిన కొండచరియల ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు పెరి గింది. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలు గురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో నలుగురు మృతి చెందడం పై సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.సహాయక చర్యలపై అధి కారులతో సీఎం మాట్లాడారు. మృ తుల కుటుంబాలకు ప్రభుత్వం అం డగా ఉంటుందని భరోసా ఇచ్చా రు. ఈ మేరకు బాధిత కుటుంబా లకు ప్రభుత్వం తరపున ఒక్కొక్క రికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కొండచరియలు విరి గిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాం తాలకు ( safe areas)తరలించే అంశంపై కసర త్తుచేయాలని అధి కారులకు సీఎం సూచించారు. రెండు మూడు రోజు లు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పకపాటించాలని సిఎం కోరారు.