–సమృద్ధిగా పంటలు పండిద్దాం, పేదరికం లేని రాష్ట్రానికి కంకణ బద్ధులవుదాం
–రాయలసీమ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu: ప్రజా దీవెన, కర్నూల్: సంపద సృష్టించటం తెలుసు, పేదలకు పంచటం తెలుసు అందుకే.. ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం, పేదరికం లేని రాష్ట్రంగా మార్చటానికి కంకణ బద్ధులయ్యాం, ఒక సారి అవకాశం అడిగితే అడవి పందులకు (wild boar) అవకాశం ఇచ్చారు, అడవి పందులు తిన్నంత తిని, మొత్తం ధ్వంసం చేస్తాయి, అదే జరిగింది, అభివృద్ధి , సంక్షేమం ధ్యేయంతో వస్తే .. ఖజానాలో ఒక్క పైసా లేదు, సర్వనాశనం చేశారు, కానీ కేంద్రం సహకారంతో నిలదొక్కు కుంటున్నాం, అని ఏసీ సీఎం చంద్ర బాబు నాయుడు (Chandrababu Naidu)అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం కృష్ణానదికి జలహారతి పట్టారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, మంచి రోజులు వచ్చాయి.
అన్నీ మంచిరోజులు కావాలని ఆకాంక్షి స్తున్నా. మల్లిఖార్జున స్వామి దర్శనం చేసుకున్నాను. ఆ తరువా త మీదర్శనమూ చేసుకున్నాను, మీ ఉత్సహాం చూస్తుంటే కృష్ణమ్మ పరవళ్లను మించిపోయింది, గడచిన 20 ఏళ్లల్లో మళ్లీ జూలై నెలలో శ్రీశైలం నిండింది. కృష్ణమ్మ పారుతోంది. రాయలసీమలో కరువు లేకుండా చేయటయే మన దృక్పథం అని చంద్రబాబు అన్నారు.ప్రతి జలాశయంలోకి (reservoir)నీరు ఇచ్చి సంపద సృష్టించే పనులెన్నో ఉన్నాయి. ఇది ఎన్టీఆర్ కల. కృష్ఱాజాలలను, మిగులు జలాలు వాడుకోవాలని చెప్పింది నందమూరు తారకరామారావు, తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తరువాతే తమిళనాడు కు ఇవ్వాలని పట్టుబట్టారు అని సీఎం వివరించారు. హందీనీవా, నగరి ప్రాజెక్టులు పూర్తి చేశాను. నేను రాయసీమ బిడ్డను, ఈ ఎన్నికల్లో మీ ఉత్సాహం చూశాను. రాజకీయాలకు పనిరాని వ్యక్తికి ఏడు సీట్లు ఇచ్చారంటే. .ఎక్కడో లోపం ఉంది. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాయలసీమ రైతుల కోసం రూ. 69000 వేల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేస్తే, ఆయన , ఆయన పేరు చెప్పను, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, ఆయన పాలనలో రూ. 19000 కోట్లు ఇచ్చారు. టీడీపీ హయాంలో అయిదేళ్ల బడ్జెట్ 7లక్షల కోట్లు కాగ.. గడచిన అయిదేళ్ల బడ్జెట్ 12 లక్షల కోట్లు అయితే, రాయలసీమ ప్రాజెక్టులకు రూ, 4400 కోట్లు ఖర్చు చేశారు.
టీడీపీ ప్రభ్తుత్వం (TDP Govt)ఏడాదికి రూ. 13600 కోట్లు ఖర్చు చేసింది.రైతులపై మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదీ రైతాంగంపై అది చిత్త శుద్ధి అని చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా రూ. 5520 ఖర్చు చేస్తే ఆయన ముష్టి రూ. 515 కోట్లు ఇచ్చారు. గాలేరు నగరి సుజల స్రవంతికి మేము రూ. 2056 ఇస్తే, కేవలం రూ. 448 ఇచ్చారని చంద్రబాబు అన్నారు. రాయలసీమకు మిగులు జలాల కోసం పోరాడింది తెలుగు దేశం పార్టీ అన్నారు. ఏ పార్డీ వల్ల ఏం జరిగింది అనే గుర్తించాలన్నా రు. గత అయిదేళ్లల్లో జనం ము ఖంలో నవ్వు లేదు. నవ్వితే కోట్టే నాయకుడు, ఏడిస్తే కొట్టించే నాయకుడుతో అల్లాడిపోయారని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం భయం లేదు.స్వేచ్ఛ లేదు. ఈ పరిస్థితికి ప్రజస్వామ్మం. కాపాడింది జనసేన, బీజేపీ అని చంద్రబాబు అన్నారు. ఆరోజే చెప్పాం. సునామీ తప్పదన్నాం. జనం చిత్తుచిత్తుగా ఓడించారు. ఎన్నో హామీలు ఇచ్చా. ఖజానాలో ఏమీ లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.సంపద సృష్టించటం తెలుసు.
పేదలకు పంచటం తెలుసు. దాచుకోవటం దాచుకోవ టం విధ్వంసం చేయటం ఈ పాలనకు ప్రజలే సాక్ష్యం ఇక అభివృద్ధి, సంక్షేమం, ఆదాయం పెంచి పేదోళ్లకు పంచటం తన ధ్యేయం అన్నారు. మంచి వర్షాలు పడితే ఐదేళ్లు కరువు లేకుండా చేయాలన్నదే లక్ష్యం. ఆ నీరు పొదుపు గా వాడి ఆదాయం పెంచటంలో మీరు అనుసంధానం కావాలి ప్రజలను కోరారు,.ఈ ఏడాది చూస్తే శ్రీశైలం, నాగార్జునా, పులిచింతల (Srisailam, Nagarjuna, Pulichintala) నిండుతుంది. కరవు లేకుండా ప్రణాళిక తయారు చేస్తా.. పంటలు పండిద్దాం. బంగారు పంటలు పండిద్దాం అన్నారు. ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి రతనాల సీమగా మారుస్తాం. పండ్ల తోటలు ఇండస్ర్టీ, మౌలిక సదుపాయాలు.. కరెంటు, రోడ్లు.. ఎండతో గాలితో కరెంటు ఉత్పత్పి చేస్తాం. భారీ ఇండస్ర్టీ తీసుకు వద్దాం అన్నారు. నీరే.. సంపద సృష్టిస్తుంది. సంపదతో ఆదాయం లభిస్తుంది.
అభివృద్ధి, సంక్షేమం , ఉద్యోగాలు వస్తాయి, అని చంద్రబాబు (Development, welfare and jobs will come, said Chandrababu)వివరించారు.కాగా, ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు చేరుకొని రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి అన్ని ప్రాజెక్టులకు ముఖచిత్ర మ్యాప్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించారు. ఏపీ జెన్ కో కుడి గట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. శ్రీశైలం డ్యాం ఎస్ఈ శ్రీ రామచంద్ర మూర్తి సాగునీటి ప్రాజెక్టుల వివరాలను సీఎంకు నివేదించా రు.అంతకుముందు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానా యుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి (Nimmala Ramana Yudu, BC Janardhan Reddy, NND Farooq, Gottipati Ravikumar, Nandyala MP Byreddy Sabari, MLA Buddha Rajasekhar Reddy)తదితరులు స్వాగతం పలికారు. అనంతరం సున్నిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజా వేదికలో పాల్గొని స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను చంద్రబాబు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, డిఐజీ కే ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఆలయ ఈఓ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.