–ఇబ్బందులు రానివ్వం నష్టపో యిన ప్రతి ఒక్కరికీ సాయం
–విపత్తు సహాయం 5 లక్షలకు పెంపు
— ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu: ప్రజా దీవెన, అమరావతి: విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలు కాపా డడం తమ ప్రభుత్వ తక్షణ కర్తవ్య మని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబా బు (Chandrababu Naidu)స్పష్టం చేశారు. ఆదివారం ఉద యం మంత్రులు, సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన అధికారులు ఎంత వద్దన్నా బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. సాయం త్రం తాడేపల్లిలోని విపత్తుల నిర్వ హణ సంస్థ కార్యాలయానికి వచ్చా రు. స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్‌లో (State Emergency Centre) అధి కారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో (Reporters) మాట్లాడా రు. ఇది మీ ప్రభుత్వం, అన్ని విష యాల్లో శ్రద్ధ తీసుకుంటున్నాం. రెస్క్యూ ఆపరేషన్‌తో బాధితులకు పునరావాసం కల్పించడం ద్వారా అన్ని ముందస్తు చర్యలు తీసుకుం టున్నాం. సహాయ చర్యల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి’ అని కోరారు. విపత్తు సాయాన్ని రూ.5 లక్షలకు పెంచామన్నారు. నష్టపో యిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తా మని హామీ ఇచ్చారు. ‘వరద బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో చొప్పున ఐదు రకాల నిత్యావసర సరుకులు ఇస్తున్నాం. ఒక్క రోజే రాష్ట్ర వ్యా ప్తంగా 28.5 సెంటీమీటర్ల అదనపు వాన పడింది. 3 జిల్లాల్లో 60%పైన, 19 జిల్లాల్లో 20–50% దాకా ఎక్కువ వర్షపాతం నమోదైంది. విజయవాడ–గుంటూరు హైవేపై కాజ వద్ద, విజయవాడ– హైదరా బాద్ మధ్య హైవేపై ( Vijayawada – Hydara Bad) చెరువుల్ని తలిపించేలా వరద వచ్చింది. ఇది చాలా బాధాకరం. దురదృష్టవ శాత్తూ కొండచరియలు పడి ఐదు గురు, గుంటూరు జిల్లాలో కారు కొట్టుకుపోయి ముగ్గురు, మంగళ గిరిలో ఒక మహిళ మృతి చెందా రు. 9 మంది చనిపోయారని ఆవే దన వ్యక్తంచేశారు.
వరద కొనసాగుతోంది…
ఎన్టీఆర్ జిల్లాలో (ntr) బుడమేరుతో పాటు ఖమ్మం, నల్లొండ జిల్లాల నుంచి వాగుల నుంచి వరద వస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి 8.90 లక్షల క్యూసెక్కుల Cusack’s) నీరు రానుంది. సోమవారానికి 10లక్షల కుపైగా క్యూసెక్కులు వచ్చే అవ కాశం ఉంది. 10–12 లక్షల క్యూసె క్కుల వరద వస్తే తక్షణం ఎలా స్పందించాలన్నదానిపై దృష్టి పెట్టాం. బ్యారేజీ దిగువ ప్రాంతాల గ్రామాలు ముంపు బారిన పడకుం డా ప్రజలను అప్రమత్తం చేశాం. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి, భోజనం, వసతి సౌకర్యాలు (Food and accommodation facilities) కల్పిస్తున్నాం.
సాధారణ పరిస్థితుల వరకూ ఇక్కడే… బుడమేరు వరద ప్రాం తాల్లో (Flood area) సాధారణ పరిస్థితులు నెల కొనే వరకు బాధితుల చెంతనే బస చేస్తా. వరద పరిస్థితిపై గంట గంట కు సమీక్షిస్తామని సీఎం చంద్ర బాబు స్పష్టం చేశారు. విజయవాడ లోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలని ఆదేశించారు. చంద్ర బాబు ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.