Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CHANDRABABU NAIDU: 100 రోజులు ప్రజా పాలనలలో జరిగిన మార్పులు ఇవే

CHANDRABABU NAIDU: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు (CHANDRABABU NAIDU)ఇది ఏమి మొదటి సారి కాదు నాలుగవ సారి సీఎం అయినా సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సారి కొత్తదనం ఏమిటి అంటే 164 సీట్లతో బారి మెజారిటీతో టీడీపీ అధికారంలోకి రావడం. అయితే తన హయాంలో ఆగిపోయిన కార్యక్రమాలను గాడిన పెట్టడానికి ఆయన ఈ వంద రోజుల సమయం ఉపయోగించుకున్నారు చంద్రబాబు. వంద రోజుల పాలన గురించి జనాలను జడ్జిమెంట్ ఇవ్వమంటే వారు కూడా ఇది చాలా తక్కువ సమయం అని అభిప్రాయం తెలుపుతున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే వంద రోజుల పాలనలో (Hundred days rule) బాబు సాధించింది ఏమిటి అంటే ఆయన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల మీద సంతకాలు పెట్టారు. అందులో మొదటగా 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీని ఒకే చేయడం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి, పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల దాకా పెంచడం, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం, యువ టాలెంట్ ని వెలికి తీసేందుకు స్కిల్ సెన్సస్ తీస్తామని హామీ ఇవ్వడం ప్రజలలో సంతోషం కలిగించింది.

అలాగే ఏపీలో (ap)పెట్టుబడులు పెట్టేందుకు చాలా మందిని ఆహ్వానించే కార్యక్రమం కూడా బాబు చేపడుతున్నారు.అలాగే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండడం బాబుకు సానుకూలంగా ఉండడంతో పెట్టుబడులు ఎక్కువగా తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని బాబు ఆలోచన ఉన్నటు సమాచారం.ఇది ఇలా ఉండగా ఇటీవల బెజవాడ ను (Bejwada) ముంచెత్తిన భారీ వరదలు (floods) అగ్ని పరీక్షనే అని చెప్పాలి. బాబునే స్వయంగా పది రోజుల పాటు జనంలో ఉండి వరద బీభత్సాని ఎదుర్కొన్నారు. అలా బాబు సంక్షోభంలో సైతం మార్కులు సాధించగలిగారు

అలాగే వరద బాధితులకు తగిన సాయం చేయడం ద్వారా మరింతగా మంచి చేశారు అనిపించుకుంటున్నారు.ఇక రెండవ వైపు చూస్తే లా అండ్ ఆర్డర్ కొంత ఇబ్బందిగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినా మహిళల మీద అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు.అలాగే రాష్ట్రంలో రాజకీయ ప్రతీకారాలు కూడా బాగా పెరిగిపోయాయి అనే సంగటనలు ఎక్కువగా అయ్యాయి. దాంతో ఆ మచ్చ కూడా ఉంది. ఈ క్రమంలో సూపర్ సిక్స్ హామీల (Super Six guarantees)విషయంలో కూడా అడుగులు ముందుకు అయితే పడలేదు. మహిళలకు ఉచిత బస్సు అని అన్నారు.కానీ అది అమలు అవ్వలేదు, అలాగే 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1500 అని అన్నారు కానీ అది కూడా అమలు అవ్వలేదు. నిరుద్యోగ యువతకు భృతి తల్లికి వందనం ఇలా కొన్నిటికి ఇంకా పునాది కూడా స్టార్ట్ అవ్వలేదు.

అలాగే ఉచిత గ్యాస్ సిలెండర్లు (Free gas cylinders)ఏడాదికి మూడు ఇస్తామని, రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా హామీలు ఇచ్చారు ఇవి కూడా ఏమీ అమలు కాలేదు.అయితే చంద్రబాబు (Chandrababu)ఇస్తారు అనే భరోసా మాత్రం అందరిలో ఈ వంద రోజుల పాలన చుస్తే అర్థం అవుతుంది.మొత్తానికి చంద్రబాబు వంద రోజుల పాలన అన్నది ఇంకా మొదటి ముద్ద తింటూ భోజనం మొత్తం బాగుందా అని అడిగినట్లుగా ఉంది అని కొందరి అభిప్రాయం .కనీసం మరో ఆరు నెలల దాకా టైం ఇస్తే ప్రభుత్వం ఎలా ఉన్నది అని తెలుస్తుంది అనికొందరి అభిప్రాయం.