Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandrababu Naidu: ‘ వినతుల’పై విస్పష్ట పరిష్కారం

–ఎన్నొచ్చినా వెనువెంటనే సత్వర పరిష్కారమే లక్ష్యం
–అంతటా భూసమస్యలే అధికంగా
విజ్ఞప్తులు రావడం గమనార్హం
–అందుకు బాధ్యులైన అధికారుల అక్రమారులపై చర్యలు తథ్యం
–రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో వినతులు స్వీకరిస్తాం
–నా పర్యటన సంధర్భంగా హడావు డి వద్దు, ప్రజా పోలీసింగ్​ అవసరం
–మీడియా చిట్ చాట్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu: ప్రజా దీవెన, విజయవాడ: పార్టీ కార్యకర్తల (Party workers)నుంచి ఎన్ని వినతులు వచ్చినా వాటన్నింటినీ పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నానని టీడీపీ అ ధినేత ఏపీ సీఎం చంద్రబాబునా యుడు (Chandrababu Naidu)తెలిపారు. అమరావతి టీడీపీ కార్యాయంలో శనివారం య ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత అయి దేళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నా యని, రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులు పై చర్యలు ఉంటాయ ని స్పష్టం చేశారు. ప్రతీ మండలం లోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని రికార్డులు కూడా తారు మారు చేశారన్నారు. భూ సమస్య లే ఎక్కువ భూముల రీ సర్వే అస్త వ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ప్రతీ జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. రెవె న్యూశాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘ టనే ఓ ఉదాహరణ అని స్పష్టం చేశారు. 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామని భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖ ను ప్రక్షాళన చేస్తామన్నారు.

వినతులు ఎక్కువ తీసుకోవటంతో పాటు ఎక్కువ సమస్యల పరీష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నానని, ప్రతీ ఒక్కరి సమస్యా సాధ్యమైనంత త్వరగా పరీష్కరిస్తానని భరోసా (Reassurance)ఇచ్చారు.తమకు అందిన వినతు లన్నీ శాఖల వారీగా విభజించి నిర్థి ష్ట కాలపరిమితి లోపు వాటి పరి ష్కారమయ్యేలా కార్యాచరణ రూ పొందించుకున్నామని, ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున సమస్యలతో వస్తున్నారన్నారు. కార్యకర్తల సమ స్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలు (Activists’ problems, public problems, job problems) ఇలా వేటికవి విభజించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకూ రాకుండా జిల్లా ల వారీగా మంత్రులు, నియోజకవ ర్గాల వారీగా ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా యంత్రాంగం రూపొంది స్తున్నామని ప్రకటించారు. జిల్లాల్లో తన పర్యటనల సందర్భంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పోలీ సు వ్యవస్థలోనూ మార్పులు తెస్తా మని చంద్రబాబు ప్రకటించారు. పోలీసు వ్యవస్థ సంయమనం పాటిస్తూ ప్రజా పోలీసింగ్ చేసే వ్యవస్థ గా మారుస్తామని స్పష్టం చేశారు. వర్షాలు పడి ప్రాజెక్టులు కూడా నిండటంతో రైతులు (farmers) సంతో షంగా ఉన్నారు. శాఖల వారీ సమీక్ష లు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు.