–డిల్లీలో నివాళులర్పించిన సిఎం లు చంద్రబాబు, రేవంత్
Chandrababu- Revanth: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలోనే యువత ఆదర్శప్రాయుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి (Alluri Sitaramaraj Jayanti)సందర్భంగా గురువారం ఎపి, తెలంగాణలలో పలు కార్యక్ర మాలు నిర్వహిoచారు.ఈ నేపథ్యం లోనే ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు (Chandrababu) అక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, కూటమికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. ఇక ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) కూడా అల్లరికి ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రా జ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు, భారత స్వాతంత్ర చరిత్ర లో మరిచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి సీతారామరాజు అంటూ ట్విట్ చేశారు రేవంత్ అదే విధంగా ఎపి మాజీ మఖ్య మంత్రి జగన్, టిడిపి జాతీయ కార్యదర్శి , మంత్రి నారా లోకేష్ లు కూడా అల్లూరికి నివాళులర్పిం చారు.