Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandrababu – Revanth: పెండింగ్ ప్రాసెస్,’ నీళ్ళు’ నములు తోన్న రాష్ట్రాలు

Chandrababu, Revanth: ప్రజా దీవెన, హైదరాబాద్ : శ్రీశైలం, సాగర్‌ రిజర్వాయర్లపై పట్టు కోసం రెండు తె లుగు రాష్టాల్ర మధ్య వి వాదం కొలిక్కి వచ్చేలా కనిపిం చడం లేదు. ఇప్పటికీ రెం డు రాష్టాల్రు కలబడుతూనే ఉన్నా యి. 2023 డిసెంబర్‌ మొదటి వా రంలో సాగర్‌ డ్యామ్‌పై ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇరు రాష్టాల్ర పోలీసుల మధ్య ఇరిగేషన్‌ అధికారులు బాహాబాహీని తిలకిం చారు. నీళ్ల వాటా విషయంలో కేసీ ఆర్‌, చంద్రబాబు, జగన్‌, ఇప్పుడు రేవంత్‌.. కృష్ణా జలాల వివాదాన్ని జఠిలం చేస్తూనే ఉన్నారు. ఎన్నిక లొచ్చిన ప్రతీసారీ ఇదొక ప్రచారా స్త్రంగా కూడా మారుతోంది. నదీ జలాల వివాదాలు.. ఏ రాష్టాన్రికీ కొత్త కాదు. ఏ నదికీ లేనివీ కావు. కావేరీ, నర్మద, మహానది, పెరి యా ర్‌, మహాదాయి ఇలా వివాదాల్లో చిక్కుకున్న నదుల జాబితా చాం తాడంత. ఆ జాబితాలో తె లుగు రాష్టాల్ర నీటివాటాల గొడవ చాలా ప్రత్యేకం. రెండు రాష్టాల్రకూ జీవనాధారమైన కృష్ణ, గోదావరి జలాల వివాదం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు పెద్ద సమస్యలా మారింది. పాక్‌, భారత్‌ కన్నా తీవ్రంగా చూడడం సరికాదు.

మహారాష్ట్రలో పుట్టి తూర్పు దిశగా పయనించి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విూదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే కృష్ణానది.. నాలుగు రాష్టాల్ర నీటి అవసరాలకు ఆసరానిస్తోంది. ఆ మేరకు వివాదాలకూ తావిచ్చింది. 70 ఏళ్లకిందట 2060 టీఎంసీలున్న కృష్ణా జలాల పంపకం దగ్గర నాలుగు రాష్టాల్ర మధ్య వివాదం ముదిరింది. పరిష్కారం కోసం రెండుసార్లు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ట్రిబ్యునళ్లను దాటి సుప్రీంకోర్టు దాకా వెళ్లింది కృష్ణా జలాల వివాదం. రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ ససేమిరా అంటే.. పాలమూరు, దిండి ప్రాజెక్టుల విూద ఏపీ సర్కార్‌ చెయ్యడ్డం పెట్టడంతో.. గతంలో కూడా కేఆర్‌ఎంబీ సమావేశాల్లో వాడీవేడి చర్చలు సాగాయి. నీటివాటాలపై జగన్‌, కేసీఆర్‌ ప్రభుత్వాధినేతలుగా ఉన్నప్పుడూ రాజీ కుదిరింది లేదు. ఓక శాశ్వత పరిష్కారం వారు చూపలేక పోయారు. చంద్రబాబు, రేవంత్‌ సన్నిహితులే అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. అంటే ఎవరి పట్టువారిదే. ఇక్కడ ప్రజలకన్నా, రాజకీయాలే పైచేయి సాధించాయి.

2021లో కూడా కృష్ణా జలాల పంపకాలపై రెండు రాష్టాల్ర మధ్య లేఖల యుద్ధం జరిగింది. కృష్ణా జలాలను చెరి సగం పంచాలని తెలంగాణ, రెండో ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకే పంపకాలు జరగాలని ఏపీ.. గట్టిగా వాదించాయి. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కూడా నీటి వాటాలు ప్రాజెక్టుల వారీగా జరగలేదని కేఆర్‌ఎంబీ దృష్టికి ఏపీ సర్కార్‌ తీసుకెళ్లింది. శ్రీశైలం నుంచి చెన్నైకు, సాగర్‌ నుంచి హైదరాబాద్‌కు తాగునీటి కోసం మాత్రమే నీళ్లను తీసుకునేందుకు వెసులుబాటు ఉందని, మిగతాదంతా పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరింది. నాలుగేళ్లు గడిచినా.. తెలంగాణ కోరుతున్న ఫిప్టీ`ఫిప్టీ డిమాండ్‌ ముందుకు జరగడం లేదు. ఇదే విషయంలో పదేళ్లు నాన్చిన బిఆర్‌ఎస్‌ నేతలు నీతులు వల్లిస్తున్నారు. వాటం తీరు మాట్లాడుతున్నారు. సిగ్‌ఊఎగ్గూ లేకుండా పంచాయితీలో ఆజ్యం పోస్తున్నారు. నీటి వాటాల సమస్య పరిష్కారం కోసం ముందుగా చిత్తశుద్దితో ఉండాలి.

కెఆర్‌ఎంబి ముందు సామరస్యంగా మాట్లాడుకోవాలి. గత ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌ జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. కానీ.. రెండు తెలుగు రాష్టాల్ర అధికారులు డుమ్మా కొట్టారు. కెఆర్‌ఎంబి ఉనికినే ప్రశ్నిస్తున్న తెలంగాణ వాదన వివాదాస్పదంగా మారుతోంది. కెఆర్‌ఎంబి లేకుంటే ఏపీ, తెలంగాణ మధ్య సమన్వయం ఎలా అని కేంద్ర జలశక్తి శాఖ ప్రశ్నిస్తోంది. విభజన చట్టంలో కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డును ప్రతిపాదించిందే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌ పార్టీ నుంచే వ్యతిరేకత రావడం ఏంటన్నది ఆలోచించాలి..ఏపీ, తెలంగాణ పరస్పరం మాట్లాడుకొని.. పట్టువిడుపులకు పోతే తప్ప ఈ గొడవ సద్దుమణిగేది కాదన్నది నిజం.

ప్రాజెక్టుల వారీగా రెండు రాష్టాల్రకూ నీటి కేటాయింపులు జరగాలని, నీటి విడుదలకూ ప్రొటోకాల్స్‌ సిద్ధం చేయాలని, రెండు రాష్టాల్ర ముఖ్యమంత్రులు సభ్యులుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఒక ఎపెక్స్‌ కమిటీని వేయాలని విభజన చట్టం ప్రతిపాదించింది. అప్పటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఛైర్మన్‌గా ఏర్పాటైన అపెక్స్‌ కమిటీ అపెక్స్‌ కమిటీ తొలి సమావేశం 2016లో జరిగింది. నాలుగేళ్ల తర్వాత రెండోసారి సమావేశమైంది. 2015 జూన్‌లో జరిగిన ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు జరగాలి.. దీన్ని కృష్ణా బోర్డు అమలుచేయాలి.. అని గట్టిగా చెప్పారు జగన్‌. ఇటు.. తెలంగాణ వైఖరి కూడా అంతే కఠినంగా ఉంది. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల్ని వెంటనే నిలిపెయ్యాలన్నది అప్పట్లో కేసీఆర్‌ పెట్టిన ప్రధాన డిమాండ్‌. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తమకే అప్పగించా లన్నది మరో మెలిక. కృష్ణా బోర్డు ఏపీకి మద్దతుగా, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించడం
ద్వారా.. అప్పట్లోనే కేసీఆర్‌ మండిపడ్డారు.

ఇలా.. నీటి వాటాలపై నాలుగేళ్ల కిందట పడ్డ పీటముడి ఇప్పటికీ విడిపోలేదు. రెండు రాష్టాల్ల్రో ప్రభుత్వాలు మారి.. కొత్త ముఖ్యమంత్రులు వచ్చినా.. కృష్ణానదీ జలాల విషయంలో రాజీ కుదరలేదు. ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌ కోరిక మేరకు.. కేఆర్‌ఎంబీ ప్రత్యేకంగా సమావేశమైనా.. పరిష్కారం దిశగా అడుగులు పడలేదు.నీటివాటాలు తేలకుండా కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత జరిగిందని, ఒక్క సంవత్సరం కోసం చేసుకున్న ఒప్పందాన్ని పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్‌ కొనసాగించిందని.. దీంతో సమస్య మరింత క్లిష్టమైందని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం సహకారం లేకపోతే కృష్ణానది నీటివాటాలు తేలడం అసాధ్యమని తేలిపోయింది. కానీ.. నీళ్లను పరిమితికి మించి వాడుకుంటోందని, కేందప్రభుత్వాన్ని మేనేజ్‌ చేస్తూ కేఆర్‌ఎంబీని తమకు అనువుగా మలుచుకుంటోందని తెలంగాణ వైపు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.