–75 వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ
–సీఎం చంద్రబాబుతో సంస్థ సీఎం డీ భేటీ
Chandrababu:ప్రజా దీవెన, అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏపీలో (ap) భారీ పెట్టు బడులు పెట్టేందుకు దిగ్గజ పారి శ్రామిక సంస్థలు (Pari labor organizations) ఆసక్తి చూపి స్తు న్నాయి. దాదాపు రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆయుల్ రిఫైనరీ, పెట్రో కమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొ రేషన్ లిమిటెడ్ (Bharat Petroleum Corporation Limited) (బీపీసీఎల్) ముందుకొచ్చింది. చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు బుధవార మిక్కడ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమం త్రి చంద్రబాబును కలిశారు. మరోవైపు తాము కూడా రాష్ట్రంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ వియత్నాంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మంచి పేరున్న విన్‌ఫాస్ట్ కంపెనీ సీఈవో పామ్ సాన్ చౌ, ఆ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంతో సమావేశమయ్యారు.
ఈ రెండు సంస్థల బృందాలతో వేర్వేరుగా భేటీ అయిన ఆయన.. తొలుత ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ (Oil Refinery, Petrochemical Complex) ఏర్పాటుపై బీపీసీఎల్ ప్రతినిధు లతో చర్చలు జరిపారు. ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టుకు 4–5 వేల ఎకరాల భూమి అవసరమవు తుందని వారు ఆయనకు తెలిపారు. దీనికి సీఎం (cm) సానుకూ లంగా స్పందించారు. అవస రమైనన్ని భూములు కేటాయించ డానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 90 రోజుల్లోగా ఈ ప్రాజెక్టు (project)ఏర్పాటుకు సంబంధించిన పూర్తి ప్రణాళికతో రావాలని కోరారు. అక్టోబరుకల్లా పూర్తి ఫీజిబులిటీ రిపోర్టుతో వస్తామని బీపీసీఎల్ ప్రతినిధులు తెలిపారు. విన్‌ఫాస్ట్ సంస్థ (Winfast Company) ప్రతినిధులు కూడా ఆయనతో సమావేశమయ్యారు. రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కర్మాగారం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు.