–అధికారుల సమీక్షలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
Change for Problem Resolution :ప్రజా దీవెన, మునుగోడు: గ్రామాల లో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరు కుపోయి మురుగుకాలు వల నిర్వ హణ సరిగా ఉండకపోవడం వల్ల దోమలు ఎక్కువై ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని పల్లెలు క్లీన్ గా ఉంచాల్సిన బాధ్యత గ్రామపం చాయతీ కార్యదర్శుల పై ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. మనిషి ఎక్కువగా అనారోగ్యం పాలు కావ డానికి కారణం త్రాగునీరు సరిగా లేకపోవడం మురుగు కాలువల ని ర్వహణ సరిగా లేకపోవడమని, మురుగు కాలవల నిర్వాహనకు చె త్త సేకరణకు, త్రాగునీటికి మొద టి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మును గోడు నియోజకవర్గంలో గ్రామపం చాయతీలో నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారం, చెప్పటాల్సిన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ లబ్ధి దారుల ఎంపికపై నల్గొండ యాదా ద్రి జిల్లాకు చెందిన డిపిఓలు డిఎ ల్పిఓలు, నియోజకవర్గంలోని పం చాయతీ కార్యదర్శులు, మునుగో డు నియోజకవర్గ ముఖ్య నాయ కులతో కలిసి మునుగోడులోని అధికారిక క్యాంపు కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వ హించా రు.
గ్రామాలలో త్రాగునీరు శానిటేషన్ ఈ రెండు బాగా చేస్తే ఎటువంటి సమస్య ఉండదన్నారు. గ్రామాల ను పరిశుభ్రంగా ఉంచే విధంగా సరై న త్రాగునీరు అందించే విధంగా గ్రా మ పంచాయతీల సమస్యలు పరి ష్కరించే విధంగా ఇక్కడి నుండి మార్పు మొదలు కావాలన్నారు. మనసా వాచాకర్మణా ప్రతి ఒక్కరం కమిట్మెంట్ తో పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. కార్యద ర్శులు ఎదుర్కొంటున్న సమస్యల ను సావధానంగా విన్న గౌరవ శాస నసభ్యులు ఆ సమస్యలు పరిష్క రించడానికి ప్రభుత్వంతో మాట్లాడ తామని హామీ ఇచ్చారు.
గ్రామాలలో నెలకొన్న సమస్యలపై నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ము ఖ్య నాయకులు తమ అభిప్రాయా లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పం చాయతీ కార్యదర్శులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని, అదేవి ధంగా చెత్త సేకరణ శానిటేషన్ విష యంలో అలసత్వం ప్రదర్శిస్తున్నా రని రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
గ్రామపంచాయతీలో చేపట్టే అక్ర మ నిర్మాణాలకు పంచాయతీ కా ర్యదర్శులు అడ్డగోలుగా అనుమ తులు ఇవ్వద్దని సూచన చేశారు. మునుగోడు నియోజకవర్గం లోని ఏడు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని మోడల్ గ్రామాలుగా తీ ర్చిదిద్దాలని త్వరలోనే మునుగో డు నియోజకవర్గ వ్యాప్తంగా స్వ చ్ఛ మునుగోడు కార్యక్రమాన్ని తీ సుకొని స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. చెత్త ను ఎక్కడపడితే అక్కడ వేయకుం డా తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధంగా ప్రజల్లో అవగాహన తీసు కురావడానికి కార్యక్రమాలు చేపట్టా లని అధికారులు ఆదేశించారు. మునుగోడు లో బెల్ట్ షాపుల ని ర్మూలనకు ప్రతి ఒక్కరం ఏ రకంగా నైతే ఉద్యమం చేసి వాటిని నిర్మూ లించమో అదేవిధంగా నియోజకవ ర్గ వ్యాప్తంగా ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరం కంకణ బద్ధులై పనిచే యాలని కోరారు. గ్రామపంచాయ తీ విస్తీర్ణాన్ని బట్టి ఆ విస్తీర్ణంలో 10 శాతం చెట్లను పెంచే విధంగా ముం దు ముందు ప్రణాళికలు చేపట్టా ల న్నారు.
ఈ సమీక్ష సమావేశంలో నియోజ కవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేత లు, యాదాద్రి నల్గొండ జిల్లాల డిపిఓ లు, డి ఎల్ పి ఓ లు, ఎంపీ డీవోలు, ఎంపిఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.