Chenab Railway Bridge: ప్రజా దీవెన, హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్ లో ప్రపంచం వండర్ గా నిర్మి తమైన వంతెన చినాబ్ రైల్వే బ్రిడ్జి డిజైనింగ్‌లో ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ మాధవీలత అద్వితీయమైన కీలక పాత్ర పోషించారని విస్తృతంగా ప్ర చారం అవుతుంది. ఆమె బృందం 17 ఏండ్ల శ్రమతో భారత్ వందేండ్ల కల సాకారమైన సందర్భం హర్షాతి రేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్ర భుత్వాలు ఎన్ని మారిన 17 ఏళ్లు గా మాధవి పర్యవేక్షణలొనే ఈ చి నాబ్ ప్రాజెక్ట్ పూర్తి కావడం విశేషం.
ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రా మం సాధారణ రైతు కుటుంబం, త ల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ , వెంకా రెడ్డి, భర్త బాపట్ల జిల్లా మైదుకూరు గ్రామానకి చెందిన హరిప్రసాద్ రెడ్డి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చి నాబ్ రైల్వే వంతెన ప్రారంభోత్సవం జరిగింది. తెలుగు మహిళ గాలి మాధవీలత రెడ్డి ఈ ప్రాజెక్టులో 17 ఏళ్లుగా కన్సల్టెంట్‌గా పనిచేయడం విశేషం. ఆమె రాక్ మెకానిక్స్‌లో ని పుణురాలు. కొండలు, రాళ్ల స్వభా వంపై పరిశోధనలు చేశారు. ఈ వం తెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉండటం విశేషం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రై ల్వే వంతెన చినాబ్‌ను ప్రధాని మో దీ ప్రారంభించారు. జమ్మూ-శ్రీనగర్ ప్రాంతాలను కలిపే ఈ వంతెన ని ర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇంజినీర్ల ప్రతిభ కూడా కీలకం కాగా ఈ ఇంజినీర్ల బృందంలో తెలుగు మహిళ గాలి మాధవీలత కూడా పాత్ర కూడా ఉంది. ఆమె గత 17 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్‌కే అంకితమయ్యారు. ఆం ధ్రప్రదేశ్‌కు చెందిన మాధవి చిన్న ప్పటి నుంచి చదువులో రాణించా రు. డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టు కున్నారు. కానీ ఆమె కొన్ని కారణా ల వల్ల బీటెక్ (సివిల్) చేయాల్సి వ చ్చింది.
సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన మాధవి కాలేజీలో ప్రొఫెసర్ల ప్రోత్సా హంతో రీసెర్చ్ (పరిశోధ న)వైపు అడుగులువేశారు. అనంతరం మా ధవి బీటెక్ పూర్తి చేశారు. అలా రీసె ర్చ్ వైపుగా ప్రయాణంలో ఐఐటీ- మద్రాస్ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు.
పీహెచ్‌డీ తర్వాత ఏడాది పాటూ ఐఐటీ-గౌహతిలో అసిస్టెంట్ ప్రొ ఫెసర్‌గా విధులు నిర్వహించారు. అనంతరం 2003లో బెంగళూరు లోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆ ఫ్ సైన్స్’లో జియోటెక్నికల్ ఇం జి నీరింగ్ ప్రొఫెసర్‌గా రెండేళ్ల పాటూ పనిచేశారు. అక్కడి నుంచి చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రాజెక్ట్‌లో చేరారు.
మాధవి గత 17 ఏళ్లుగా ఈ చినాబ్ ప్రాజెక్ట్‌కు కన్సల్టెంట్‌గా విధుల్లో ఉ న్నారు. రాక్ మెకానిక్స్‌పై పట్టు ఉం ది. అందుకే చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రాజె క్టులో అక్కడ ఉన్న శిలలు, వాటి బ రువు, గట్టిదనంపై ఆమె పరిశో ధన లు చేశారు. ఇలా సుదీర్ఘంగా ఈ ప్రా జెక్ట్ కోసం పనిచేశారు.