–11మంది మావోయిస్టుల మృతి
–కొనసాగుతోన్న మావోయిస్ట్ ల ఏరివేత కార్యక్రమం
Chhattisgarh Encounter: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో అందులో చత్తీస్ ఘడ్ (Chhattisgarh)లో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ము మ్మరంగా కొనసాగుతోంది. చత్తీస్ గఢ్ నారాయణ పూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ (encounter)లో 11మంది మావోయిస్టులు మృతి (died)చెందారు. కొహకమెట్ పీఎస్ ధనందికుర్రెవాయ్ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్ కౌంటర్ సంఘటన చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పుల అనంతరం 11మంది మావోయి స్టు లు చనిపోయినట్లుగా పోలీసులు (police) తెలిపారు. ఈ సంవత్సరం ప్రారం భం నుంచి చత్తీస్ గఢ్ కేంద్రంగా మావోయిస్ట్ ల ఏరివేత కార్యక్ర మాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఎన్ కౌంటర్ లు చేపడ్తున్నాయి. ఈ ఆపరేషన్ లో ఇప్పటికే 150మందికి పైగా మావో యిస్టులు మృతి చెందారు. భౌగోళి కంగా మావోయిస్ట్ లకు అత్యంత అనుకూలమైన అబూజ్ మఢ్ వం టి దట్టమైన అడవిలో, కొండ ప్రాం తాల్లో సైతం పోలీసు బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నా యి. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల పరిధిలో విస్తరిం చి వున్న అబుజ్డ్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ (Operation Kagar in forest area) లో భాగంగా మా వోల ఏరివేతకు నిర్వహిస్తున్న విస్తృ త కూంబింగ్ ఆపరేషన్లు, వరుస ఎన్ కౌంటర్లతో (encounter) మావోయిస్టులు భారీగా ప్రాణ నష్టపోతున్నారు.