Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister A. Revanth Reddy : ఏటీసీ పనుల పురోగతిపై సీఎం ఆ రా, అన్ని ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్

Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇండ స్ట్రి యల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్ (ITI) ను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు (ATC) గా తీర్చిదిద్దుతు న్న పనుల పురోగతిపై ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరా తీశా రు. టాటా టెక్నాలజీస్ సహకారం తో ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడేషన్ పనులపై ముఖ్యమంత్రి కా ర్మిక శాఖ ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో సమీక్షించారు. ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో రూపుదిద్దు కుంటున్న ఏటీసీలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒకటి ఉండేలా చూడాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాలని చేయాలని, ఐటీఐలు లేని కేంద్రాల్లో కొత్తగా ఏటీసీలను ఏర్పాటు చే యాలని చెప్పారు.

 

నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏటీసీల్లో అవసరమైన సిబ్బంది ఇతర వివ రాలను అధికారులు వివరించగా, సిబ్బంది నియామకాలపై ముఖ్య మంత్రి పలు సూచనలు చేశారు. ఏటీసీల ఏర్పాటుకు అవసరమైన నిధులను వెంటనే అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పా రు. అలాగే గిగ్, ఫ్లాట్ ఫామ్ వర్క ర్స్ యాక్ట్ విషయంలో పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని ఈ సంద ర్భంగా కార్మిక శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతా ధికారులు పాల్గొన్నారు