Chief Minister A. Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణను దేశానికి ఆదర్శంగా నిలబె ట్టాలన్న సంకల్పంతో పని చేస్తున్నా మని, అందులో భాగంగా ఒక గొప్ప నమూనా నగరంగా ఫ్యూచర్ సిటీ ని నిర్మించి, ముఖ్యమంత్రి ఎ. రేవం త్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం జనా వాస యోగ్యమైన నగరంగా కాకుం డా వేలాది కోట్ల రూపాయల పెట్టు బడులు తీసుకొచ్చి, అన్ని వర్గాల యువతకు లక్షలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశ గా ‘ఫ్యూచర్ సిటీ’కి ప్రణాళికలు సి ద్ధం చేశామని చెప్పారు. శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పం డుగ సందర్భంగా రాష్ట్ర దేవాదా య శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రవీం ద్ర భారతిలో ఏర్పాటు చేసిన వేడు కలో పండితులు బాచంపల్లి సంతో ష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా పాల్గొన గా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క, ఇతర మంత్రులు, ప్రజా ప్రతి నిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూస్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప ఒక సం పూర్ణమైన నగర నిర్మాణం దేశంలో ఎక్కడా జరగలేదు. ఉన్న నగరాలే కాస్త విస్తరించబడ్డాయి. నగరాల విస్తరణ అస్తవ్యస్తంగా మారడం వల్ల ప్రపంచంలో వెనుకబడిన దేశంగా ఉండిపోయింది. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రై జింగ్ #TelanganaRising దేశా నికి ఆదర్శంగా నిలబెట్టే, ప్రజలకు ఆదర్శంగా ఉండే విధంగా, హైద రాబాద్ నగరానికి ప్రపంచ స్థాయి లో గుర్తింపు తేవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రో డ్డు వంటి ప్రాజెక్టులతో పాటు గరా నికి ఒక కొత్త ఫ్యూచర్ సిటీని నిర్మిం చాలని తలపెట్టాం.వేద పండుతుల పంచాంగ పఠనం విన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బ డ్జెట్ గుర్తొచ్చిందని, బడ్జెట్ కూడా షడ్రుచులతో కూడుకుని ఉంది.
బడ్జెట్ లో కొన్ని నియంత్రణలు పా టించారు. చాలా అంశాల్లో ఉదా రంగా ముందుకొచ్చారు. ఉప ము ఖ్యమంత్రితో కలిసి జోడెద్దుల్లా రా ష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడి పించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం.యువతకు ఉద్యోగ, ఉ పాధి అవకాశాలు కల్పించడం, రై తులు పండించిన పంటకు సంపూ ర్ణ సహకారాన్ని అందిస్తూ గిట్టుబా ట ధరలతో వ్యవసాయాన్ని ప్రోత్స హించాలని, పేదలకు వైద్యం అం దించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం తో ఆ రంగాలకు అధిక నిధులు కే టాయించడం జరిగింది.రాష్ట్రం అ భివృద్ధి సాధించాలంటే పెట్టుబడు లు రావాలి. శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు కావాలి. అసాం ఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహ రించాలని ప్రభుత్వం నిర్ణయిం చిం ది. ఆ దిశగా నిరంతరం ప్రయ త్నం జరుగుతూనే ఉంటుంది. ఒక ప్పుడు పేదవాడు పండుగ పూట మాత్రమే తెల్లన్నం తినే వారు.
మొ ట్టమొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. 1.90 లకే కిలో బియ్యం పథ కాన్ని, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు రూ. 2 లకే కిలోబియ్యం పథ కం, ఆ తర్వాత దేశంలో ఆహార భ ద్రతా చట్టం తేవడం వంటి కార్యక్ర మాలతో పేదవారి ఆకలిని దూరం చేసే దిశగా ప్రయత్నాలు జరుగు తున్నాయి.శ్రీమంతులు తిన్నట్టుగా నిరుపేదలు సన్నబియ్యం తినాలి. తెలంగాణలో సన్నబియ్యం అత్య ధికంగా పండించే దిశగా ప్రభుత్వం గిట్టుబాటు ధరలతో పాటు బోనస్ ఇవ్వడం ద్వారా రైతులను ప్రోత్స హిస్తున్నాం. గతేడాది దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి సాధించుకున్నాం. ఈ సీజన్ లో కూడా అత్యధికంగా పండిస్తున్నా రు. రైతులు పండించిన సన్న బి య్యాన్ని పేదలకు పంచాలన్న ఒక గొప్ప లక్ష్యంతో, ఈ ఉగాది పండు గ పేదవారి ఇళ్లల్లో సంతోషాన్ని తె చ్చిపెట్టాలని ఈరోజు రాష్ట్ర వ్యా ప్తంగా సన్నబియ్యం పథకాన్ని ప్రా రంభిస్తున్నాం.
తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉన్నదని వేద పండితు లు చెప్పినట్టుగా రాష్ట్రాభివృద్ధికి మంచి నిర్ణయాలు తీసుకుంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రా జ్యాంగబద్ధమైన సంస్థలతో మంచి వాతావరణంలో అందరి సహకారం తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకె ళ్తాం.మా సంకల్పంలో, ఆలోచనల్లో స్పష్టత ఉంది. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కరుణిస్తారు. తెలం గాణ రైజింగ్ 2050 ప్రణాళికతో దే శంలోనే రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా ఒక అద్భుతమైన అభివృద్ధి చెంది న రాష్ట్రంగా తీసుకెళ్లాలని సంక ల్పించాం. అందరి ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడు తామని ముఖ్యమంత్రి చెబుతూ ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగా ది శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు కొం డా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధి కారు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గవర్నర్ కు సీఎం శుభాకాంక్ష లు…
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉగా ది శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ని కలిసి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా మంత్రి కొం డా సురేఖ, ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ రెడ్డి, లోక్‌సభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.