Chief Minister A. Revanth Reddy : సీఎం కీలక నిర్ణయం, విద్యా వ్య వ స్థ రూపకల్పనకు సమగ్ర విధాన ప త్రం
Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధా న పత్రం రూపొందించాలని ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యా కమిషన్‌ను ఆదేశించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వం వెనుకాడబో దని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి ప రిస్థితులకు అద్దం పట్టేలా, ఆచరణ యోగ్యంగా విధాన పత్రం ఉండాల ని చెప్పారు.
ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపా లు, తీసుకురావల్సిన సంస్కరణ లపై ముఖ్యమంత్రి ఐసీసీసీలో ని ర్వహించిన ఉన్నతస్థాయి సమా వేశంలో సమీక్షించారు. విద్యా రం గానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రా ధాన్యత, ఉపాధ్యాయుల నియా మకం, అమ్మ ఆదర్శ కమిటీలు, పు స్తకాలు, యూనిఫాంల పంపిణీతో పాటు యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూ నివర్సిటీ (YISU) నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వివరించారు.
ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది బలపడుతుందని ప్రాథ మిక విద్యను బలోపేతం చేస్తే ఉన్న త చదువుల్లో విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించగలరని ముఖ్య మంత్రి అభిప్రాయపడ్డారు. అంగన్ వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థా యిలో తీసుకురావల్సిన మార్పు లపై సమాజంలోని వివిధ సంఘా లు, ప్రముఖులతో చర్చించి మెరు గైన విధాన పత్రం రూపొందిం చా లని సూచించారు. విద్యా వ్యవ స్థలో తెలంగాణ అగ్రగామిగా ఉం డేందుకు దోహదపడేలా సూచన లు, సలహాలు ఉండాలని చెప్పా రు.
వివిధ రాష్ట్రాల్లో జరిపిన పర్య టనలు, ఆయా రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ప్రాథమిక విద్యలో అను సరిస్తున్న విధానాలను విద్యా కమి షన్ చైర్మన్ ఆకునూరి మురళి ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
1960 దశకం నుంచి ఇప్పటివరకు విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన పలు సంస్కరణలు క్రమేణా విద్యా ర్థుల సృజనాత్మక శక్తి, ఆలోచనా ధోరణిని ఎలా హరించి వేశాయో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫా ర్మ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయ ప్రకాశ్ నారాయణ (లోక్‌సత్తా జేపీ) వివరించారు. విద్యా వ్యవస్థలో తీ సుకోవలసిన చర్యలపై పలు సూచ నలు చేశారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్ర భుత్వ సలహాదారు కే. కేశవ రావు, తెలంగాణ విద్యా కమిషన్ సభ్యు లు ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు, డా. చారుకొండ వెంకటేష్ గారు, కె. జ్యో త్స శివా రెడ్డి, ఇతర ఉన్నతాధికా రులు పాల్గొన్నారు.