Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy Chief Minister Bhatti Vikra Marka : ఆ నాలుగువందల భూమి హెచ్ సి యూకి సంబంధించిoది కానేకాదు

— హెచ్ సీయూ ఇంచు భూమిని ప్రభుత్వం గుంజుకోలేదు
–గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 లోని 400 ఎకరాలు హెచ్ సీయూ ది కాదు
— ప్రైవేటు వ్యక్తి చేతుల్లోని భూమి ని కాపాడి ప్రజలకు ఆస్తిగా సమ కూర్చాం
–పది సంవత్సరాలు గత పాలకు లు ఆభూమిని గాలికొదిలేశారు
–ప్రజల కోసం సంపద సృష్టించ డానికి ఈ భూమిని టీజీఐఐసీకి అప్పగించాం
–మీడియా సమావేశంలో వెల్లడిం చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క

Deputy Chief Minister Bhatti Vikra Marka : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివ ర్సిటీకి సంబంధించిన ఇంచు భూ మిని కూడా ప్రజా ప్రభుత్వం గుంజు కోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి వి క్రమార్క స్పష్టం చేశారు. కంచ గచ్చి బౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధిం చింది కాదని తేల్చి చెప్పారు. ప్రైవే ట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన రాష్ట్ర సంపదను న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించి తిరిగి ప్ర జలకు ఆస్తిగా ప్రజా ప్రభుత్వం తీ సుకొచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలి పారు. మంగళవారం రాష్ట్ర సచివా లయంలో మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిల తో కలిసి ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మాట్లాడారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీకి కేటాయించిన 534.28 ఎక రాల భూమిని 2024 ఫిబ్రవరి 03న రెవిన్యూ అధికారులకు అప్పగిం చగా, వారు గోపన్ పల్లి గ్రామం లోని సర్వే నెంబర్ 36 లో 191.36 ఎకరాలు సర్వేనెంబర్ 37 లో 205 .20 ఎకరాలను హైద రాబాద్ సెం ట్రల్ యూనివర్సిటీ కి అప్పగించి భూ బదలా యింపు చేసుకున్నారని భూ బదలాయింపు జరిగిన తర్వా త అప్పటి ప్రభు త్వం కంచ గచ్చి బౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీ రావు ప్రాతినిథ్యం వహించిన ఐఎం జి ఫ్లోరిడాకు చెం దిన ఐఎంజి భారత్ అనే క్రీడా నిర్వహణ సంస్థకు కేటా యించారని, ప్రభుత్వం ఒప్పందం మేరకు ఆ భూమిలో ఎలాంటి కా ర్యకలాపాలు చేపట్టకపోవడంతో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అ యిన తర్వాత ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా కోట్లాది విలువైన 400 ఎకరాల భూ మిని ఐఎంజి భారత్ కు కేటాయించడాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు.

అప్పటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఐఎంజి భారత్ సవాల్ చేస్తూ హైకోర్టులో WP NO 24781 ద్వారా రిట్ పిటిషన్ దాఖలు చేశా రని చెప్పారు.‌ ఐఎంజి భారత్ వేసి న రిట్ పిటిషన్ పై అప్పటి ముఖ్య మంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశ య్య, కిరణ్ కుమార్ రెడ్డిలు న్యా యస్థానంలో అనుభవమున్న న్యా యవాదులను నియామకం చేసి ప్ర భుత్వపరంగా వాదనలు వినిపిం చారని వివరించారు. మన వనరు లు మనకే కావాలని, ఆస్తిత్వం, ఆ త్మగౌరవం కోసం దశాబ్దాలుగా పో రాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గ త పాలకులు ప్రైవేటు వ్యక్తి చేతు ల్లో ఉన్న ఈ భూమిని ప్రభుత్వానికి తీసుకువచ్చే విషయాన్ని పట్టించు కోకపోగా గాలికి వదిలేశారని వి మర్శించారు.

కోట్లాది విలువైన ఈ భూమి ప్రై వేటు వ్యక్తి చేతుల్లోనే ఉంటే మరో రకంగా గత పాలకులు వారి చేతు ల్లోకి తెచ్చుకోవాలనే కుట్రతోనే న్యా యస్థానంలో గట్టిగా కొట్లాడ లేద న్నారు. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉన్న 400 ఎకరాల భూమి రాష్ట్ర సంప ద, ప్రజల ఆస్తిగా భావించిన ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా యావత్తు మంత్రి మండలి కూర్చొ ని ఆలోచన చేసి ఎట్టి పరిస్థితిలో ఈ భూమి ప్రైవేటు వ్యక్తి చేతుల్లోకి పోనివ్వకుండా ప్రజలకు సంపద సృష్టించే ఆస్తిగా ఇవ్వాలని నిర్ణ యం తీసుకొని మంచి న్యాయ వాదులను నియామకం చేసి న్యా యస్థానంలో కొట్లాడి వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్రానికి తీసుకొచ్చామని ఇది ప్రజల విజ యమని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్య క్తి చేతుల్లో అన్యాక్రాంతమైన వేల కోట్ల విలువైన భూమిని కాపాడి ప్ర జలకు ఆస్తిగా ఇచ్చిన ప్రజా ప్రభు త్వాన్ని శభాష్ అని ప్రశంసించా ల్సిన ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

గత పాలకుల మాదిరిగా ప్రజా ప్ర భుత్వం స్పందించకుంటే వేలాది కోట్ల విలువైన 400 ఎకరాల భూ మి ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యా క్రాంతం అయ్యి ఉండేది కాదా అని వారిని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తి నుంచి తీసుకువచ్చిన భూమిని రా ష్ట్ర ప్రజలకు ఆస్తిగా సృష్టించాలని, లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తాపత్రయంతో రె వెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీ కి అప్పగించామే తప్ప ఇందులో ఎవ రికీ ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేద న్నారు. ఆనాటి కాంగ్రెస్ ముఖ్య మంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ లో ఫేస్ 1, ఫేస్ 2కి పునాదులు వేయడం వల్లనే హైద రాబాద్ గ్లోబల్ సిటీగా మారడం వల్ల అనేక ఐటీ సంస్థలు నగరానికి వచ్చి కంపనీలు పెట్టడం వల్ల లక్షల మంది యువతకు ఉద్యోగాలు దొరి కాయని తద్వారా హైదరాబాద్ మ హానగరం అభివృద్ధి చెందింద న్నా రు. అదే తరహాలో కంచ గచ్చి బౌలి లోని 400 ఎకరాల్లో సంపద సృష్టిం చడం యువతీ యువకులకు ఉ ద్యోగాలు కల్పించాలన్న ఆలోచన తో దాని అభివృద్ధి చేస్తున్నామే తప్ప ఇందులో ప్రభుత్వానికి ఎ లాంటి స్వార్థం లేదని వివరించారు.

టీజీఐఒసీ తయారు చేసిన డ్రాఫ్ట్ లేఔట్ లో ఈ భూముల్లో ఉన్న న్యా చురల్ రాక్ ఫార్మేషన్స్, దాని లో భాగంగా మష్రూమ్ రాక్ ను కాపా డడానికి ప్రత్యేక చర్యలు గైకొనడం లో భాగంగా ఈ ప్రాంతాలను లే అ వుట్ నుండి మినహాయించామని చెప్పారు. పొల్యూషన్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ఉండాలని పర్యావ రణ సమతుల్యతను కాపాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దని వివరించారు.

ప్రైవేటు వ్యక్తి చేతుల్లో అన్యాక్రాం తం కాకుండా పోరాటం చేసి కాపా డిన ఈ భూమిని ప్రజలకు ఆస్తిగా ఇవ్వడానికి ప్రజా ప్రభుత్వం చేస్తు న్న ప్రయత్నాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారి మీడియా సంస్థల ద్వారా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచా రాన్ని ప్రజలు అర్థం చేసుకొని తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. కొంతమం ది వ్యక్తుల ప్రయోజనాల కోసం రా ష్ట్ర సంపదను తాకట్టు పెట్టమని ప్ర జల ఆస్తిని వారి చేతుల్లోకి పోనివ్వ మన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో నాకు వ్యక్తిగతం గా బాండింగ్ ఉందని ఈ సంద ర్భంగా గుర్తు చేశారు.‌

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీ మరింత అభివృద్ధి చెందాలని అందుకు కావలసిన సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, అక్కడ చదివిన ప్రతి విద్యార్థికి బ యటకు రాగానే ఉద్యోగాలు రావా లని, మంచి భవిష్యత్తు ఉండాలని మా ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు.