Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister anumula Revanth Reddy: పేదోళ్ల చెంతకు సన్నబువ్వ చేరాలన్నదే సంకల్పం

— తెలుగు నామ సంవత్సరం రోజు నే ప్రతిష్టాత్మకoగా ప్రారంభించాం
–శ్రీమంతులు తినే సన్న బియ్యం తండాలు, గుడిసెల్లోని ప్రజలంద రూ తినాలన్నదే ధ్యేయం
— హుజూర్నగర్ సభలో ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Chief Minister anumula Revanth Reddy:ప్రజా దీవెన హుజూర్ నగర్: పేదవాడు పండుగనాడు మాత్రమే తెల్ల బువ్వ తినడం కాకుండా ప్రతి రోజు తెల్లబువ్వ తినాలన్న ఉద్దేశం తో అత్యంత ప్రతిష్టాత్మకమైన స న్న బియ్యం పథకాన్ని ప్రారంభిం చినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం అయన తెలుగు నూతన సంవత్స రం విశ్వావసు నామ ఉగాది సంద ర్భంగా సూర్యాపేట జిల్లా ,హుజూర్ నగర్ లో ప్రతిష్టాత్మక సన్న బి య్యం పథకాన్ని ప్రారంభించారు. శ్రీమంతులు తినే సన్న బియ్యం తండాలు, గుడిసెలు, బలహీన వర్గాల ప్రజలందరూ తినాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభిం చామని పథకం ప్రారంభం సంద ర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలి పారు. ముందుగా ఆయన రాష్ట్ర ప్రజలకు ఉగాది, రంజాన్ శుభా కాంక్షలు తెలియజేశారు.

పేదవారు పండుగనాడు మాత్రమే సన్న బియ్యం అన్నం తినే పరిస్థితి రాష్ట్రంలో ఉందని,అలాంటిది తమ ప్రభుత్వం హాయంలో కోట్లు విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో 1.90 పైస లకే సన్న బియ్యం పథకం పెట్టినప్ప టికీ అది అమలు కాలేదని, అనం తరం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చారని,కాలక్రమమైన అది కొన సాగుతూ వస్తూ ఇప్పుడు పేదవా రికి 6 కిలోల దొడ్డు బియ్యాన్ని ఇవ్వడం జరుగుతున్నదని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల మం దికి బియ్యం ఇస్తే తిరిగి అదే బి య్యాన్ని రైస్ మిల్లర్లకే 10 రూపా యల కిలో చొప్పున అమ్మడం వల్ల దొడ్డు బియ్యం దలారుల పాలై 10,000 కోట్ల రూపాయలు వారి చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని అన్నారు.


ఇలాంటి పరిస్థితులను రూపుమా పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి రాష్ట్ర మంత్రివర్గంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న ట్లు చెప్పారు. హుజూర్నగర్, కోదా డలో అత్యధికంగా రైస్ మిల్లులు ఉన్నాయని, ఉమ్మడి నల్గొండ జిల్లా లో 12 లక్షల ఎకరాలలో వరి పండి స్తున్నారని తెలిపారు. గత ప్రభు త్వం 21 వేల కోట్ల విలువైన వడ్ల ను రైస్ మిల్లర్లతో తాకట్టు పెట్టడం జరిగిందని చెప్పారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అని గత ప్రభుత్వం చెప్పిందని అలాంటిది తమ ప్రభు త్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని నిర్ణయించామని సన్న వడ్లకు ప్రోత్సాహంలో భాగం గా 500 రూపాయల బోనస్ ఇస్తు న్నామని, బోనస్, రుణమాఫీ ఉమ్మడి నల్గొండ జిల్లాకే ఎక్కువగా వచ్చిందని తెలిపారు.

సన్న బియ్యం పథకం ఆషామాసి పథకం కాదని, ఎవరు వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని, ఏసీఎం అయినా మార్చలేరని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన పదేళ్లలో పక్కకు పెట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ను తిరి గి చేపట్టడం జరిగిందని, గత ప్రభు త్వ హయాంలో పడావు పెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటికీ గ త బడ్జెట్లోనే 24 వేల కోట్లు కేటా యించి చేపట్టామన్నారు .లక్ష కోట్లు పెట్టి కట్టిన కాలేశ్వరం కడితే మూ డేళ్లలో కూలిపోయినప్పటికీ తా ము వెనకంజ వేయకుండా రాష్ట్రం లోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈ సంవత్సరం కోటి 56 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండించామన్నారు. మూడు కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం ఇవ్వనున్నామని ,ఎన్ని వేల కోట్ల యినా ఖర్చు చేసైనా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు.

గత ప్రభుత్వం బకాయి పెట్టిన రైతుబంధు నిధులు 7625 కోట్లు తాము అధికారంలోకి వచ్చిన మూ డు నెలల్లోనే చెల్లించామని, ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చె ప్పారు. హుజూర్ నగర్ కు వ్యవసా య కళాశాల, మిర్యాలగూడ, దేవ రకొండ లకు 200 కోట్ల చొప్పున యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కోదా డకు ఏటీసీ కేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటిం చారు.

రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపా రుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ సన్న బియ్యం పథకం అద్భుత పథకమని అన్నా రు. సమాజంలో అణగారిన వర్గాల వారు, రైతు కూలీలు, మహిళలు, బీసీలు, దళితులకు ఆహారం పెట్టే మంచి పథకమని, ఇది నిజమైన ఆహార భద్రత పథకం అని అన్నా రు. భారతదేశం తెలంగాణ వైపు చూసేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ఉచితంగా అమలు చేయడం లేదని అన్నారు.

90 లక్షల రేషన్ కార్డులలోని రెం డు కోట్ల 80 లక్షల మంది లబ్ధిదా రులకు 6 కేజీల చొప్పున సన్న బి య్యం ఇస్తున్న పథకమని చెప్పా రు. ఇప్పుడు దొడ్డు బియ్యం పై పిడిఎఫ్ ద్వారా , 10065 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేదని ,ప్రభుత్వం 40 రూపాయల కిలో కొని ఇచ్చినప్పటికీ లబ్ధిదారు లు ఆ బియ్యాన్ని తినకుండా కిలో ఐదు, పది రూపాయలకు అమ్ము కుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం చొరవతో ఉగాది నుండే రాష్ట్రవ్యాప్తంగా 80 నుండి 84 శాతం మంది ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ రేష న్ కార్డులు ఇవ్వనుందని, తెల్ల కార్డు స్థానంలో బిపిఎల్ వారికి మూడు రంగుల కార్డులు ఇస్తామ ని ,గులాబీ కార్డు బదులుగా ఆకుప చ్చ కార్డు ఇవ్వనన్నామని తెలిపా రు. సన్న బియ్యం పథకం హుజూ ర్నగర్ లో ప్రారంభించడం చారిత్రక ఘట్ట మని,ఇదొక విప్లవాత్మక మా ర్పు అని ఆయన కొనియాడారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని పథకం సన్న బియ్యం పతకమని అని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమం త్రి సన్న బియ్యం పథకాన్ని పది మంది లబ్ధిదారులు ధరావత్ బుజ్జి, మాలోతు రంగా, కర్ల రాధా, షేక్ రెహమాన్, షేక్ కరీమా, కర్పూ రపు లక్ష్మి , గురువమ్మ, సుశీల, వెంకట పుష్ప లకు అందజేశారు .

అంతేకాక 26 కోట్ల 10 లక్షల రూపాయల విలువచేసే చెక్కును 12712 స్వయం సహాయ మహిళా సంఘాల సభ్యులకు రాయితీ వడ్డీ రుణాల కింద పంపిణీ చేశారు .రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా, సుఖేందర్ రెడ్డి , రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంక టరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ లు కుందూరు రఘువీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సల హాదారు వేణుగోపాలరావు, వేం నరేందర్ రెడ్డి,ఎం పి అద్దంకి దయా కర్, శాసనసభ్యులు నల్లమాడ పద్మావతి, బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల ఐలయ్య, మందుల శామ్యూల్, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పర్యటకశాఖ కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, శాసనసభ్యులు బాలు నాయక్, శ్రీహరి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రాష్ట్ర పౌరస రఫరాల శాఖ సెక్రటరీ డిఎస్ చౌ హన్ ,రాష్ట్ర సమాచార పౌర సం బంధాల శాఖ కమిషనర్ హరీష్, విద్యాశాఖ డైరెక్టర్ నర్సిం హారెడ్డి, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తదితరులు హాజర య్యారు.