Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister Revanth Reddy : సన్నబియ్యం పంపిణీకి సర్వం సన్న ద్ధం

–ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు పూర్తి
–హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్,లీడర్ తో సమీక్ష
–అధికారులతో కలసి సభాస్థలి ఏర్పాట్లు పరిశీలన
–సభా స్థలికి రాజీవ్ ప్రాంగణంగా నామకారణం
— రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Chief Minister Revanth Reddy : ప్రజా దీవెన హుజూర్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక మైన నిర్ణయం సన్నబియ్యం పంపి ణీ ప్రారంభించడానికి ఏర్పాట్లు పూ ర్తి స్థాయిలో చేశామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెల్ల రేషన్ కార్డు దారులంద రికి సన్న బియ్యం అందించే ప్రక్రి యను హుజుర్నగర్ నుండి ప్రారం భించేందుకు నిర్ణయం తీసుకున్నా మన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉగాది పర్వ దినం రోజున హుజుర్నగర్ నుండి ప్రారంభించడానికి నిర్ణయం తీసుకు న్న నెపద్యంలో అదే రోజు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు 40 వేలకు తగ్గకుండా జన సమీకరణ కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

సభాస్థలికి రాజీవ్ ప్రాంగణంగా నామకరణం… రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమ ప్రారంభోత్సవ సభా స్థలి కి రాజీవ్ ప్రాంగణంగా నామకరణం చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్ల డించారు.ఈ సందర్భంగా గురువా రం ఉదయం హుజుర్ నగర్ నియో జకవర్గ కేంద్రంలో బహిరంగ సభాస్థ లి ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి పౌర సరఫరాల కార్య దర్శి డి.ఎస్.చౌహన్,జిల్లా కలెక్టర్ నందాలాల్ తేజస్ పవార్, ఎస్.పి నరసింహ తదితర అధికార యం త్రాంగంతో కలిసి ఆయన పరిశీ లించారు.

పార్టీ క్యాడర్ సమావేశంలో ఉత్తమ్…. అనంతరం ఆయన హుజుర్నగర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావే శంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తోందని ఏ ఒక్క రైతు ఆ ధైర్య పడాల్సిన అవసరం ఉండదని భరో సా ఇచ్చారు.రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధర చెల్లించి ప్రభు త్వం కొనుగోలు చేసిందన్నారు.

అంతకు మించి సన్నాలను ప్రోత్సా హించేందుకు గాను ప్రభుత్వం ప్రక టించిన 500 బోనస్ తో అద్భుత మైన ఫలితాలు సాదించామ న్నా రు. బి.ఆర్.ఎస్ పాలనలో జరిగిన విధ్వంసంనుండి రైతాంగాన్ని బయ ట పడేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందాన్నారు.

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమా న్ని ప్రారంభించేందుకు ఇక్కడికి వ స్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన 2,000 సింగిల్ బెడ్ రూమ్ లను పరిశీలిస్తారన్నా రు.హైదరాబాద్ తరహాలో ఇక్కడ రింగ్ రోడ్ నిర్మించడంతో పాటు హుజుర్నగర్,కోదాడ నియోజకవర్గ కేంద్రాలలో ప్రభుత్వ కార్యాలయా లకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్న ట్లు ఆయన వివరించారు.

రాష్ట్రంలో 80 శాతం మంది పేదల కు సన్నబియ్యం అందించేందుకు ఉద్దేశించబడిన సన్న బియ్యం పం పిణీ కార్యక్రమం హుజుర్నగర్ నుం డి ప్రారంభం కావడం మహదానం దంగా ఉందన్నారు.

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ సన్న బియ్యం….

ఉగాది పర్వదినం రోజున హుజుర్ నగర్ లో నిర్వహించ తలపెట్టిన స భ చరిత్రలోనే చారిత్రాత్మకంగా నిలి చి పోతుందని రాష్ట్ర నీటిపారుద ల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు దిగు వన ఉన్న నిరుపేదలందరికి సన్న బియ్యం పంపిణీ అన్నది దేశ చరి త్రలోనే ఒక మైలు రాయి లాంటిద ని ఆయన కొనియాడారు. అటువం టి సన్నబియ్యం పంపిణి ప్రారంభో త్సవ కార్యక్రమం హుజూర్ నగర్ కేంద్రంగా జరగడం ఇక్కడి ప్రజల అదృష్టంగా భావిస్తునన్నారు.

ఈ నెల 30 న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జి ల్లా హుజుర్నగర్ నియోజకవర్గ కేం ద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించ నున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రాం గణం వేదికగా జరప తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్య వేక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట ఐ. జి.సత్యనా రాయణ, జిల్లా కలెక్టర్ తేజస్ నం దాలాల్ పవార్, ఎస్.పి నరసింహ తదితరు లు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్, క్యాడర్ తో సభా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నిరుపేదల కడుపు నింపేందు కు గాను ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణి కార్యక్రమం ఇక్కడి నుండి ప్రారంబించుకోవడం ఒక అద్భుతమైన ఘట్టాన్ని అవి ష్కరించబోతుందన్నారు.

అటువంటి అద్భుతమైన ఘట్టంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయి రాష్ట్ర జనాభాలో 84 శాతానికి అం దించ బోతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు నిచ్చారు.