Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister Revanth Reddy : ఒప్పందాల పరంపర, రుద్రారంలో రూ.562 కోట్లతో తోషిబా ఫ్యాక్టరీ

Chief Minister Revanth Reddy :ప్రజా దీవెన, టోక్యో: తోషిబా కార్పొ రేషన్ యొక్క అనుబంధ సంస్థ టీ టీడీఐ (ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూష న్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి. విద్యుత్ సరఫ రా, పంపిణీ రంగంలో పెట్టుబడు లు, ఆవిష్కరణలను ప్రోత్సహిం చేందుకు ప్రభుత్వంతో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏ ర్పాటు చేస్తుంది. వీటితో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూ షన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సు లేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్ప టికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అ ప్‌గ్రేడ్ చేయనుంది.

ఈ ప్రాజెక్ట్ కు రూ. 562 కోట్ల పె ట్టుబడులు పెట్టనున్నారు. అ త్యాధునిక టెక్నాలజీని ఉపయో గించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవ కాశాలను కల్పిస్తుంది. రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యా క్టరీలను వి జయవంతంగా నిర్వహిస్తున్న టీ టీడీఐ, ఈ కొత్త పెట్టుబడితో మూ డో ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. ప్రస్తు తం ఉన్న ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరించనుంది.


టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి సమక్షంలో తోషిబా కా ర్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనెటా, రాష్ట్ర ప్రభుత్వ స్పె షల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, టీటీడీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫురుటా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరివర్తనలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని అన్నా రు. పరిశ్రమల భాగస్వామ్యాలు, వ్యూహాత్మక సహకారాలతో అన్ని రంగాల్లో ప్రపంచ పెట్టుబడిదారుల ను ఆకర్షిస్తోందని అన్నారు. కొత్త పెట్టుబడులకు తోషిబా చేసుకున్న ఒప్పందం పారిశ్రామిక రంగంలో కొ త్త ఉత్సాహమిస్తుందని అన్నారు.

టీటీడీఐ చైర్మన్ హిరోషి ఫురుటా తె లంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు తమను ఆ కట్టుకున్నాయన్నారు. కొత్త ఆవిష్క రణల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబ ద్ధత తెలంగాణను పెట్టుబడుల గ మస్య్థానంగా మార్చుతున్నాయ ని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పని చేసేందుకు ఉత్సా హంతో ఉన్నట్లు చెప్పారు.