–కావలసిన మందులు ముందే సిద్ధంగా ఉంచుకోవాలి
–సీజనల్ వ్యాధుల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
–ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆకస్మిక తనికి వైద్యులకు పలు సూచనలు
District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : సీజనల్ వ్యాధుల బారిన పడిన చిన్న పిల్లలకు సత్వర చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. అంతేకాక ఆయా వ్యాధులకు సంబంధించి వ్యాధి నివారణ మందులు ముందే సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.చిన్న పిల్లలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తల్లిదండ్రులలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
గురువారం ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి చిన్న పిల్లల వార్డును ఆకస్మిఖంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న చిన్న పిల్లలను పరిశీలించిన అనంతరం వారి వివరాలను ఆసుపత్రి సూపరింటిండెంట్ అరుణ కుమారి, చిన్న పిల్లల విభాగం అధిపతి డాక్టర్ వందన లను అడిగి తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులతో ముఖ్యంగా జ్వరం తో ఆసుపత్రిలో చేరిన పిల్లలకు సంబంధించి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ కేసుల వివరాలను అడిగారు. సీజనల్ వ్యాధులతో వచ్చిన చిన్న పిల్లలకు తక్షణ చికిత్స అందించాలని,ఇందుకు అవసరమైన మందులు ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో ఉన్న మందులు,ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ నగేష్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ స్వరూపా రాణి, తదితరులు ఉన్నారు.