–156 సినిమాల్లో 537 పాటల్లో మెగాస్టార్ 24 వేల స్టెప్పులు
–గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికా ర్డ్స్‌లో చోటు
–సర్టిఫికెట్‌ను అందజేసిన గిన్నిస్ బృందం
— చిరంజీవికి సీఎంలు చంద్రబాబు,రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు
Chiranjeevi: ప్రజా దీవెన, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మరో అరుదైన గౌరవం ఆయన సొంత మైంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరంజీవి (Chiranjeevi) స్థానం దక్కిం చుకున్నారు. తను నటించిన సినిమాల్లోని 537 పాటల్లో 24 వేల డాన్స్ స్టెప్పులతో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో ప్రేక్షకులను అలరించి నందుకు ఆయనను ఈ అవార్డ్‌కు గిన్నిస్ నిర్వాహకులు ఎంపికచే శారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమం లో గిన్నిస్ బుక్ (Guinness Book)ప్రతినిధి రిచర్డ్స్, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan)సంయుక్తంగా సర్టిఫికేట్‌ను చిరం జీవికి అందజేశారు. ఈ సందర్భం గా చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ ‘‘నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ప్రణం. ఆ ఆసక్తి వల్లే ఈ రికార్డు నా సొంతమైంది. ఈ ఘనత సాధించి నందుకు చాలా ఆనందంగా ఉంద ని అన్నారు. ఆమిర్‌ఖాన్ మాట్లాడు తూ చిరంజీవికి నేను వీరాభిమా నిని. నేను ఆయనను పెద్దన్నయ్య లా భావిస్తాను. ఆయనకు ఇంత గొప్ప గౌరవం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, డైరెక్టర్లు రాఘవేంద్ర రావు, బి.గోపాల్, కోదండరా మిరెడ్డి, గుణశేఖర్, బాబీ.. నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్‌బాబు, అశ్వనీదత్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ప్రముఖుల అభినందనలు…
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరంజీవికి చోటు దక్కడం పట్ల ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవి తన నటన, డా న్స్‌తో తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో కీలకపాత్ర పోషించారు అని అభినందించారు. చిరంజీవికి గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కడం తె లుగు వారిగా మనమంతా గర్విం చాల్సిన సందర్భం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ప్రశంసిం చారు. నృత్యం అంటే మెగాస్టార్, మెగాస్టార్ అంటేనే నృత్యం అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చిరంజీవిని కొనియాడారు. ఏదైనా సాధించా లనుకునే యువత చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలని హరి యాణ గవర్నర్ బండారు దత్తాత్రే య సూచించారు. విజయాలు, రికార్డులు అన్నయ్యకు కొత్త కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం ఎంతో ప్రత్యేకం అని ఏపీ డిప్యూటీ సీఎం పవ న్ కల్యాణ్ స్పందించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు చిరంజీవిని అభినందించారు.