–ఏపి మద్యం స్కాంపై విచారణ ప్రభుత్వ నిర్ణయం
–అవసరమైతే ఈడీ విచారణకూ సిఫారసు చేస్తాం
–మద్యంపై అసెంబ్లీలో శ్వేత పత్రం
విడుదల చేసిన సీఎం చంద్రబాబు
CID:ప్రజా దీవెన, అమరావతి : ఆంధ్రప్ర దేశ్ లో జరిగిన మద్యం అమ్మకాలలో అక్రమాలపై సీఐడీతో (CID) విచారణ జరిపిస్తామని ముఖ్య మంత్రి చంద్ర బాబు (Chandra Babu) ప్రకటించారు. లోతైన విచారణకు అవసరమైతే ఈడీ విచారణకు కూడా సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. బుధ వారం అసెంబ్లీలో మద్యం అమ్మ కాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడు తూ నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవు తాయి. నేరస్థుడే రాజకీయ నేత, సీఎం అయితే ఏం జరుగు తుందో గత ఐదేళ్లలో చూశామని, మేం విడుదల చేస్తోన్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందని అన్నారు. గత ప్రభు త్వం మద్యపాన నిషేధం, లిక్కర్ ఔట్ లెట్ల తగ్గింపు అని చెప్పి అన్నీ విస్మరించిందని విమర్శించారు. మద్యం ధరలు పెంచుకుంటూపోతే తాగే వాళ్ళు తగ్గుతారని చెప్పిన గత పాలకులు పొరుగురా ష్ట్రాలతో పోలిస్తే ధరలు విపరీతంగా పెంచా రని, 75 శాతం రేట్లు పెంచినా మద్యం వినియోగం అమాంతం పెరి గిపోయిందని లెక్కలతో సహా వివ రించారు. అమ్మ కాలు పెరిగినా ఏపీ లో ఆదాయం తగ్గిందన్న చంద్ర బాబు పెరిగిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపిం చారు. ఏపీలో మద్యం కుంభకోణం భయంకరంగా సాగిందన్నారు.
దేశంలో దొరికే లిక్కర్ (Liquor) ఏపీలో దొరకలేదని, ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమేశారని చెల్లిం పులు ఆలస్యం చేయడం, ఆర్డర్లు ఇవ్వకపోవడం వంటి చర్యలతో వేధించారు. లోకల్ బ్రాండ్లు (Local brands)తీసుకొ చ్చి షాపుల్లో విక్రయించారని చంద్ర బాబు తెలిపారు. ఏమి అమ్మితే అవే తాగే పరి స్థితిని ప్రజలకు కల్పించారన్నారు. మద్యం అనేది ఒక వ్యసనమని, పేదవాడు శారీర కంగా కష్టపడి బాధలు మర్చిపో యేందుకు తాగుతారని, వారి అల వాటును బలహీనంగా చేసుకొని దోచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బును తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో (Excise Department) పెట్టుబడి పెట్టిం చారని, దీంతో ఆయా శాఖలకు దాదాపు రూ.250 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. తప్పుచేసి న వాళ్లను కఠినంగా శిక్షిస్తామన్నా రు. ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళ న చేస్తామని, సరైన పాలసీలు తీసుకొచ్చి పేదలకు అందు బాటు ధరలో మద్యం లభించే విధంగా చూడటంతో పాటు డీఅడిక్షన్ సెంటర్లనూ ఏర్పాటు చేయాల్సిన అవ సరముందన్నారు. ఏ విధంగా ప్రక్షాళన చేయాలన్నదానిపై సల హాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.