— ప్రభుత్వ తాజా నిర్ణయంతో వైసీపీలో అలజడి
— వైసీపీ కార్యకర్తల లొంగు’బాట’తో అప్రమత్తం
–నిందుతులెవరిని వదిలేది లేదం టున్న ప్రభుత్వవర్గాలు
CID:ప్రజా దీవెన అమరావతి: ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్టంలోని మూడు ప్రధాన కేసులను సీఐడీకి (CID) అప్ప గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసు కోవడంతో వైసిపీ నేతల్లో అలజడి ప్రారంభమైoది. ఈ మూడు కేసుల తెరవెనుక వైసీపీ ముఖ్యనేతలు ఉండటంతో పార్టీలో చర్చనీయాం శం అయింది. ఈ విచారణ ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని నేత లు అందోళన చెందుతున్నారు. ఎందుకైనా మంచిదనే భావనతో న్యాయ నిపుణులను (Legal experts) సంప్రదిస్తు న్నారు. మరి కొందరు ముందస్తు స్టేలు తీసుకుంటుంటే, ఇంకొందరు కోర్టుల్లో సరండర్ అవుతున్నారు. ఒక్కటొక్కటిగా జరుగుతున్నఈ సంఘటనలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యనేతల అనుచరులు, కార్యకర్తలకు కంటిమీద కునుకు ఉండటం లేదు.
టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP Central Office), చంద్రబాబు నివాసంపై దాడి కేసు, సినీనటి కాదంబరీ జెత్వానీ కేసును సీఐడీకి ప్రభుత్వం బదిలీ చేసింది. ఇఫ్పటి వరకు కేసు విచారణ చేపట్టిన మంగళగిరి పోలీసులు వాటి రికార్డులను మంగళవారం సీఐడీ పోలీసులకు అంద చేశారు.. పోలీసుల విచారణకు, సీఐడీ పోలీసుల విచారణకు చాలా వ్యత్యాసం ఉండటంతోపాటు ఎక్కువ కాలం విచారణ జరిగే అవకాశాలు ఉండటంతో నిందితులు తమ ప్రాంతాలను దాటి వెళ్లడానికి అవకాశం లేదు. అలాగే సంచలనం సృష్టించిన సినీనటి కాదంబరీ జెత్వానీ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణకు సంబంధించిన రికార్డులన సీఐడీకి (cid)అప్పగించాల్సి ఉంది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబరు 19న వైసీపీ (ycp)కార్యకర్తలు దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 106 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి, 21 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఈ కేసులో అరెస్టు అయి రిమాండ్ లో ఉన్నారు. గుంటూరు నాయకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నాయకులు దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురామను (Thalashila Raghurama)పోలీసులు విచారించారు. దాడి జరిగిన రోజు ఉదయం వీరంతా ఎక్కడ కలిశారు? ఏయే ప్రాంతాల్లో సమావేశమయ్యారు? తదితర వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం జరిగిన విచారణలో ఈ ముగ్గురు నాయకుల నుంచి పోలీసులు ఎఠువంటి సమాచారాన్నిసేకరించలేక పోయారని పోలీసుల కధనం. ఈ నేపధ్యంలోనే లేళ్ల అప్పిరెడ్డి ముఖ్య అనుచరుడు టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో సోమవారం లొంగిపోయాడు. ఈయన వైసిపి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో టిడిపి కార్యాలయంపై దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అధికారులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. కూటమి ప్రభుత్వం రాగానే చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా చైతన్య ఉన్నాడు.
అదే విధంగా ఉండవల్లిలోని చంద్రబాబు (Chandrababu) ఇంటిపై 2021 సెప్టెంబరు 18న వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఇప్పటి వరకు మంగళగిరి పోలీసులు జోగి రమేష్ ని పోలీసు స్టేషన్ కి పిలిపించి ముడుసార్లు విచారణ జరిపారు. ఇంకా పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. సినీ నటి జెత్యానీ కేసులో ఏసీపీ స్రవంతిరాయ్ విదారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. కేసు నమోదు చేయక ముందే ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ, పలువురు పోలీసు అధికారులు ముంబయి వెళ్లారని, తప్పుడు పత్రాలను సృష్టించి కోర్టును తప్పుదారి పట్టించారని తేలింది. ఆ కేసును దర్యాప్తు చేసిన ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాదంబరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులను సీఐడీకి అప్పగించడంతో హాట్ టాపిక్గా మారాయి. కారణం వైసీపీ ముఖ్యనేతలు ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండడమే. జత్వానీ కేసులో కూడా తాడేపల్లి నుంచి కుట్ర రచన జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. అదే విధంగా టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలలోనూ పెద్దల హస్తం ఉందని మొదటి నుంచి చెబుతోంది. సీఐడీ విచారణ చేపట్టి ఈ మూడు కేసుల్లో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది. మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరవెనుక కీలకంగా వ్యవహరించారని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. ఈ నేపధ్యంలోనే సజ్జల హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు.
వైసీపీలోని (ycp)ముఖ్య నాయకులెవరినీ వదిలి పెట్టే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం లేదని తెలుస్తోంది. విశాఖపట్నంలోని విలువైన భూములను అధికారుల సహాయంతో కొందరు నేతలు తమ పేర్ల మీద రిజిష్టర్ చేయించుకున్నారనే ఆరోఫణలు ప్రధానంగా వినపడుతున్నాయి. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy), ఆయన కుమార్తె హస్తం ఇందులో ఉండనే ఉద్దేశంతో వాటిపైనా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే వేల కోట్ల విలువైన దసపల్లా భూముల వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ భూములు నిషేధిత జాబితా 22-ఏ నుంచి తొలగింపు ప్రక్రియ మొదలుకొని అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి జరిగిన ఒప్పందంలో గూడుపురాణిపై నిగ్గుతేల్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. వైసీపీ పెద్దలకు భారీ లాభం చేకూరేలా ఈ వ్యవహారంలో ఏం జరిగిందో నివేదించాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం వివరాల సేక రణలో నిమగ్నమైంది. గత ప్రభుత్వ హయాంలో కీలక పెద్దల ప్రమేయం తో నగరంలో అత్యంత ఖరీదైన భూములు (Most expensive lands) చేతులు మారాయి. మరిన్ని బలవంతంగా దోచుకోగా, అందులో దసపల్లా భూముల వ్యవహారం ఒకటి. భీమిలి మండలం కొత్తవలసలో 15 ఎకరాలను శారదాపీఠాధిపతికి ఎకరా రూ. లక్షకు కట్టబెట్టడంపై ఇప్పటికే ప్రభుత్వాని కి జిల్లా యంత్రాంగం నివేదిక పంపింది.. కూటమి అధికారం చేపట్టిన తరువాత గత నెలలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా దసపల్లా భూములను సందర్శించారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై జిల్లా యంత్రాం గం నివేదిక సిద్ధంచేసి పంపనున్నది.