Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CII: రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా నడుద్దాం

–రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలి
–తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కచ్చితంగా కట్టుబడిఉంది
–బిఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఆర్ఆర్ఆర్ జాప్యం
–కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

CII: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: రాజకీయం ఎన్నికల వరకే పరిమితమని, ఆ త ర్వాత అభివృద్ది కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరు ద్ఘాటించారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) (CII) ఆద్వర్యంలో తెలంగాణలో పారిశ్రామిక అభి వృద్ధిపై జరిగిన చర్చలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, రఘువీర్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థ సారథిరెడ్డి హాజరయ్యారు. ఈ సం దర్భంగా కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒకరి ముఖాలు మరొకరు చూసుకునే పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్రా భివృద్దే అజెండాగా కలిసి పనిచే యాలని చెప్పారు. ‘గాడిద గుడ్డు’ అంటూ నాయకులు మాట్లాడడం మంచి సంస్కృతి కాదన్నారు. తెలం గాణకు కేంద్రం ఏమిచ్చిందో లెక్కల తో సహా వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడతామన్నారు.

హైదరాబాద్ తర్వాత వరంగల్ వేగంగా అభివృద్ధి చెందుతోందని పర్యాటకం, ఐటీ, వినోదరంగాల (Tourism, IT, entertainment)అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని స్పష్టం చేశారు. గత కేసీఆర్ ప్రభు త్వం నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ముందుకు సాగలేదని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం లాభదాయకం కాదని 3 కమిటీలు చెప్పాయని గుర్తుచేశారు. కేంద్రం నిర్మించకపోతే తామే కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తా మని కేటీఆర్ ప్రకటించారని, పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు పెట్టలే దని ప్రశ్నించారు. బయ్యారం ఫ్యాక్ట రీ లాభదాయకమైతే తానే కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తీసుకువచ్చే వాడినని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా కలిసి నడు ద్దామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. కేంద్రంతో ఘర్షణ వాతా వరణం లేకుండా పనిచేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా రని గుర్తు చేశారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి Kishan Reddy) ఎక్కడికి రమ్మంటే అక్క డికి వచ్చి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహబూబ్ నగర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ (food processing unit)ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరారు. ఐఐఎం ఏర్పాటు చేస్తే తెలంగాణ యువతకు మేలు జరు గుతుందని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హెూ దా ఇవ్వాలని, లేదంటే మరే రకం గానైనా నిధులు విడుదల చేసేలా చూడాలని కోరారు. తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై ఒక పుస్తకం తయారు చేయించామని, బీజేపీ ఎంపీలకు కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఖనిజరంగాభివృద్ధిలో ప్రైవేటు రంగం పాత్ర కీలకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవ డంలో ఖనిజ రంగానిది ముఖ్య పాత్ర అని చెప్పారు. గురువారం ఢిల్లీలోని ఎమ్ జీఎమ్ఐ (మైనింగ్, జియలాజికల్, మెటలర్జికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో గనుల రంగంపై జరిగిన జాతీయ సదస్సులో కిషన్ రెడ్డి మాట్లాడారు.

గనుల రంగంలో (Mining sector)ఎదురవుతున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల గురించి వివరించారు. భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవస రం ఉందని చెప్పారు. ఖనిజాల అన్వేషణ కోసం కంపెనీలు ముందు కు రావడం లేదన్నారు. దీనిని దృష్టి లో ఉంచుకుని ఖనిజాల అన్వేషణ ప్రక్రియలో 50 కోట్ల ఖర్చును భరిం చేందుకు కేంద్రం ముందు కొచ్చింద ని తెలిపారు. గనుల రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఇలాంటి నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రా యపడ్డారు. యూపీఏ హయాంలో గనుల కుంభకోణాలు వెలుగుచూ సిన నేపథ్యంలో పారదర్శకత కోసం వేలం విధానాన్ని తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు.