**సిఐటి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ..
CIT President Lakshminarayana : ప్రజా దీవెన/ కనగల్: మండలంలోని రేగట్టే గ్రామపంచాయతీ కార్యదర్శి నర్సిరెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టాలని సిఐటి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు.రేగట్టే గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న జిల్లా విజయ్ నీ కులం పేరుతో పాటు అసభ్య పదజాలంతో దూషించి అవమానపరిచిన రేగట్టే గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి సుంకిరెడ్డి నర్సిరెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, అతని వెంటనే సస్పెండ్ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
ఆదివారం కనగల్లు మండల కేంద్రంలో జిల్లా విజయ్ ని అవమానించిన పంచాయతీ కార్యదర్శి నర్సిరెడ్డి ని సస్పెండ్ చేయాలని నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రకుల అహంకారంతో పంచాయతీ కార్యదర్శి సుంకిరెడ్డి నర్సిరెడ్డి దళితుడైన విజయ్ నీ కులం పేరుతో తిడుతూ అవమానకరమైన మాటలతో దూషించారని ఇలాంటి వారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. కనగల్లు మండలం రేగట్టే గ్రామపంచాయతీలో గత 15 సంవత్సరాలుగా ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తున్న విజయ్ సాధారణ కార్మికుడే కాగా తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మండల అధ్యక్షుడిగా ఉన్నాడని అతనిపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అంటే నర్సిరెడ్డి అహంకారం ఏంటో అర్థం అవుతుందని అన్నారు.
పంచాయతీ కార్యదర్శి నర్సిరెడ్డి గ్రామపంచాయతీలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని ఆయన అవినీతికి విజయ్ సహకరించినందువల్లనే కక్షగట్టి వేధింపులకు గురిచేస్తూ ఈ రకంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. జిల్లా అధికార యంత్రాంగం జ్యోక్యం చేసుకొని అతని వెంటనే సస్పెండ్ చేయాలని,అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల జిల్లా కలెక్టర్ డిపిఓ ను కలుస్తామని అప్పటికి న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో *సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కానుగు లింగస్వామి, యూనియన్ జిల్లా నాయకులు ఇరిగి ఎల్లేష్, మండల అధ్యక్షులు జిల్లా విజయ్, కార్యదర్శి కొంగల నరసింహ, మండల నాయకులు కట్ట శ్రీనివాసరెడ్డి, కె పాండు, శంకర్, నాగేశ్వరి, పారిజాత, కిరణ్, బిక్షం, సాగర్ రాములు లింగయ్య,యాదగిరి,సైదులు, శంకరయ్య బిక్షం తదితరులు పాల్గొన్నారు.