Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CITU Palleti Harikrishna: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

సిఐటియు మండల శాఖ అధ్యక్షులు పల్లేటి హరికృష్ణ

CITU Palleti Harikrishna: నాంపల్లి ప్రజా దీవెన మార్చి 8 గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిఐటియు మండల శాఖ అధ్యక్షులు పల్లేటి హరికృష్ణ అన్నారు సిఐటియు రాష్ట్ర కమిటీ తెలుగు మేరకు నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం మండల అభివృద్ధి అధికారి సమస్యలను పరిష్కరించి వేతనాలు అందించాలనివినతి పత్రం అందించారు.

మండల శాఖ అధ్యక్షులు పల్లేటి హరికృష్ణ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం ఉద్యోగ తరహాలో 20 25 జనవరి ఒకటి నుండి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు కానీ ఇంతవరకు జీతాలు చెల్లించక కార్మికుల సమస్యలను పరిష్కరించక ఇబ్బందులను పెడుతున్నారని అన్నారు సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలం కార్యవర్గ సభ్యులు అబ్బనబోయిన వెంకటయ్య పుష్పక వెంకటయ్య ఎల్లయ్య అంజయ్య సైద మ్మ రాములు అరుణ తదితరు లు పాల్గొన్నారు.