Civil Honor: ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు మండలం గంగోరి గూడెంలో ప్రాథమిక పాఠశాల Gangori Gudem Primary School)ఉపాధ్యాయులకు (teachers) గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గ్రామం లోని ప్రాథమిక పాఠశాలలో సేవ లందించి పదోన్నతి, బదిలీపై వెళ్లిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూ తం ముత్యాలు, ఉపాధ్యాయు లు బత్తిని భాస్కర్ గౌడ్, గ్రామస్తుల చేత పౌర సన్మానం ఘనంగా నిర్వ హించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగయ్య గారు,మాజీ సర్పంచ్ పానుగంటి పారిజాత,అంగన్వాడీ టీచర్ మంజుల,కాంగ్రెస్ పార్టీ Congress party)మండల నాయకులు గోపగాని పాపయ్య,లావణ్య,శవగోని మహేష్,జనగాం జగతయ్య జనగాం సతీష్, జనగాం శ్రీకాంత్,రమేష్, చందు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.