Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Atishi: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొనసాగుతా

–ఢిల్లీ సీఎం అతీషి సంచలన వ్యాఖ్యాలు

CM Atishi: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ (CM Atishi)సోమవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీక రించారు. ఆ బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కు రాలిగా ఆమె నిలిచారు. ఈ సందర్భంగా ఆమె రామాయణంలో రాముడి కోసం భరతుడు చేసినట్లు తాను ఆపద్ధర్మ ముఖ్య మంత్రిగా పని చేస్తానని వ్యాఖ్యానించారు.
తన పక్కన ఓ ఖాళీ కుర్చీని ఉం చారు. ఆ కుర్చీలో సీఎంగా కేజ్రీవా ల్ (Kejriwal as CM)మళ్లీ కూర్చుకుంటారన్న సంకేతా లు ఇచ్చారు. రామాయణంలో రా ముడి పాదరక్షలు సింహాసనంపై ఉంచి భరతుడు రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు పాలించిన విషయం తెలిసిం దే. ఓ కుర్చీని అతిశీ చూపిస్తూ ఇది ముఖ్యమంత్రి సీటని, కేజ్రీవాల్ (Kejriwal )మళ్లీ సీఎం అయ్యే వరకు ఇది ఖాళీగా ఉంటుందని అన్నారు. దీం తో ఆమెపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కేజ్రీవాల్ రిమోట్ కంట్రోల్‌ ప్రభుత్వాన్ని నడుపుతారా అని ప్రశ్నించింది. కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి మిగతా వ్యవహారా లంతా కేజ్రీవాలే (Kejriwal) చూసుకుంటారని విమర్శించింది.కాగా ఇటీవలే ని రాడం బరంగా రాజ్ భవన్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమా ణస్వీకారం జరిగింది. ఢిల్లీ ముఖ్య మంత్రిగా అతిశీతో ప్రమాణ స్వీకా రం చేయించారు. ఎల్జీ వినయ్ కు మార్ సక్సేనా. ఢిల్లీ 8వ ముఖ్య మంత్రిగా అతిశీ నిలిచారు. మంత్రు లుగా సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ ప్రమాణ స్వీకారం (Oath taking) చేశారు. సెప్టెంబర్ 26-27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీలో అతిశీ బలనిరూపణ చేసుకోను న్నారు.