Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Chandrababu: గుడ్లవల్లేరు ఘటనపై సిఎం చంద్రబాబు ఆరా

–తాజా పరిణామాల విచారణ వివ రాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి
— తప్పు జరిగిందని తేలితే అత్యం త కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశం

CM Chandrababu: ప్రజా దీవెన, అమరావతి: కృష్ణా జి ల్లా గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమెరాలు పెట్టారనే అం శంపై జరుగుతున్న విచారణను సి ఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu)స్వయం గా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను (Minister Kollu Ravindra and district MLAs) కళాశాలకు వెళ్ళాలని ఆదేశించిన ముఖ్యమంత్రి ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణా మాలను ఎప్పటికప్పుడు తెలు సుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి విచారణ సాగు తున్న విధానంపై వివరాలు తెలు సుకున్నారు. విద్యార్థినుల ఆందో ళనను, ఆవేదనను పరిగణలోకి తీసుకుని పటిష్ట దర్యాప్తు జరపా లని ఆదేశించారు.

రహస్య కెమె రాల (secret cemera)ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో నేరం రు జువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్ గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చా లన్నారు. ఆందోళనలో ఉన్న వారికి ఒక భరోసా (barosa)కల్పించాలని సిఎం ఆదే శించారు. విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాల న్నారు. కాలేజ్ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినుల వద్ద ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని ఆయన కోరారు. స్టూడెంట్స్ ఎవరూ అధైర్య పడవద్దని, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల పట్ల తప్పుగా ప్రవ ర్తించారని తేలితే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి (cm)స్పష్టం చేశారు. ప్రతి మూడు గంటలకు ఒక సారి తనకు ఘటనపై రిపోర్ట్ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. వ్యవహారంపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సూచించారు.