ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి ఎయిమ్స్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబు రు అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్స వంలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ఎయిమ్స్ మంగ ళగిరికి 10 ఎకరాల భూమి ఇస్తామ ని తెలిపారు.దేశంలో ఏ AIIMS కు కూడా ఇలాంటి భూమి లేదు, అమరావతి భారతదేశపు భవిష్య త్ సిటీ మంగళగిరి ఎయిమ్స్ భార తదేశంలోనే నంబర్ 1 అవుతుం దనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
960 బెడ్లు ఉన్న ఆసుపత్రి 1618 కోట్లు ఖర్చుతో సిద్ధమైన ఆసుపత్రి మంగళగిరి ఎయిమ్స్ సొంతంగా అభివర్ణించారు. డాక్టర్లుగా ఎదగడా నికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండా లని డైరెక్టర్ మధవానంద కర్ అంటున్నారని, అందుకే ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామ ని వెల్లడించారు. ఇక, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకోవాలని విద్యా ర్థులకు సూచించారు సీఎం చంద్ర బాబు. ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండి యా అవ్వడం ఆవిడ సాధించిన విజయంగా పేర్కొన్న ఆయన కష్ట పడితే ఈ ప్రపంచంలో సాధించ లేనిది ఏదీలేదు అనడానికి ద్రౌపది ముర్ము జీవితం ఒక ఉదాహరణ అన్నారు. అవకాశం ఉంటే నాకు ఇక్కడ చదువుకోవాలని ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తులో ఎయిమ్స్ మంగళగిరికి ఎలాంటి మౌళిక సదు పాయాల లోటు ఉండనివ్వమని, కొలనుకొండ లో రీసెర్చ్ సెంటర్, ఐఐటీతో అనుసంధానించాలను కుంటున్నారని, మెడికల్ అనేది ఇప్పుడు మెడ్ టెక్ గా మారిపో యిందని, డీప్ టెక్ ను మెడికల్ లో కూడా అమలు చేయాలనుకుంటు న్నామన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.