–ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగ కుం డా చర్యలు
–భారీ వర్షాలు, వరదల పై ఉన్నత స్థాయి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు
CM Chandrababu:ప్రజాదీవెన, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై (On heavy rains and floods)ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సమీక్ష నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించిన సీఎం జిల్లాలలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం (Loss of life and property) జరగకుండా చూడాలని ఆదేశించారు.
సాధారణంగా 185 మిల్లీ మీటర్లకు గాను 244 ఎంఎం వర్షపాతం(rainfall) నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31 శాతం అదనంగా వర్షపాతం నమోదు అయిందని అధికారులు వెల్లడించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు కూడా ఉన్నాయన్నారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీన పడ్డాయని, వీటిపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు (Irrigation and Revenue Departments)సమన్వయంతో పనిచేయాలని, ఫ్లడ్ మాన్యువల్‌ను అధికారులు పాటించాలని సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని, అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్‌గా పనిచేయాలని సూచించారు.