Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Chandrababu: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టిడిపి నో..!

–ఏపి సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
–ఉత్తరాంధ్రలో 850 మంది ప్రతిని ధుల్లో 250 మంది కూటమి సభ్యు లు ఉండడం వల్లనే

CM Chandrababu: ప్రజా దీవెన, విశాఖ: ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ (Uttarandhra MLC) ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కూటమి పక్షాల నేతల (leaders of the coalition parties)మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్త రాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 850 మంది ప్రతినిధులు ఉన్నారు. అందులో దాదాపు 250 మంది వరకు కూటమి పక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు.ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో (MLC by-election) పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

కూటమి పక్షాల నేతల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ (Uttarandhra MLC) ఎన్నికల్లో మొత్తం 850 మంది ప్రతినిధులు ఉన్నారు. అందులో దాదాపు 250 మంది వరకు కూటమి పక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. మిగిలిన సభ్యులు వైసీపీ కి చెందినవాళ్లు ఉన్నారు. ఈ సమయంలో వాళ్లను కూటమివైపు తిప్పుకోవడం మంచిదికాదని అధిష్టానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో పోటీకి దూరంగా ఉండడం మంచిదని టీడీపీ ముఖ్య నేతలు భావించారు. కాగా నిన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ చెల్లుబాటు అయితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలోకి (tdp)వచ్చేందుకు మొగ్గుచూపారు.

దీంతో కూటమి తరఫున పోటీ చేద్దామని స్థానిక టీడీపీ నేతలు (TDP leaders) అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. ఈ సమయంలో వైసీపీ (ycp) వాళ్లను పార్టీలోకి తీసుకుని ఫిరాయింపులకు ప్రొత్సహించడం మంచిదికాదని అధిష్టానం స్పష్టం చేసింది. కాగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ‘కూటమి’ నిర్ణయం తీసుకుంది. విజయం సాధించేందుకు అవసర మైన బలం లేనందున పోటీ చేయక పోవడమే మంచిదని మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్టు చెబు తున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి అధిష్ఠానం కూడా సూచనప్రాయంగా సంకేతాలు పంపింది. ఒక ఎమ్మెల్సీ సీటు (MLC seat)కోల్పోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ ఉండదని నేతలు కూడా అభిప్రాయప డుతు న్నారు. ఇదిలావుండగా నామినే షన్ల దాఖలుకు మంగళవారం మ ధ్యాహ్నం మూడు గంటల వరకూ గడువు ఉంది. ఈలోగా ఏమైనా నిర్ణయం మారితే తప్ప పోటీకి దూ రంగా ఉండడం దాదాపు ఖాయమ ని తెలిసింది.