–ఒపీ సేవల బందుతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అవస్థలు
–కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యా ప్తంగా ఆందోళనలు
–నిందితులను శిక్షించాలంటూ పశ్చి మ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం నిరసన పాల్గొన్న వైనం
CM Mamata Banerjee: ప్రజా దీవెన, కోల్ కత్తా: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై (On Junior Doctor in Kolkata) హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపు తోంది. దేశంలో వైద్యులంతా ఐక్య మై రోడ్డెక్కారు. ముందు తమ ప్రా ణాలకు రక్షణ కల్పిస్తే తాము రోగు ల ప్రాణాలు కాపాడతామంటూ వై ద్యులు నినదిస్తున్నారు. మరోవైపు పార్టీలకు అతీతంగా అన్ని రాజకీ య పక్షాలు వైద్య విద్యార్థినికి న్యా యం చేయాలని డిమాండ్ చే స్తు న్నాయి. ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగా త్వరగా విచార ణ పూర్తిచేసి నిందితులను కఠినం గా శిక్షించాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) సైతం నిరసన ల్లో పాల్గొన్నారు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పశ్చిమబెం గాల్ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తు న్నారు. కోల్‌కతాలో జరిగిన ఘట నపై దేశంలో వైద్యులంతా ఏకతాటి పైకి వచ్చారు. గతంలో ఏవైనా ఘట నలు జరిగేటప్పుడు స్వరాష్ట్రంలో మాత్రమే నిరసనలు జరిగేవి. తీవ్రత ఆధారంగా దేశ వ్యాప్తంగా నిరసన గళం వినిపించేది. ప్రస్తుతం కోల్‌క తా ఘటనపై ప్రతి ఒక్కరూ న్యా యం కోసం నినదిస్తున్నారు. మరోవై పు ఈ ఘటనలో నిందితులందరిని తక్షణమే అరెస్ట్ చేయాలనే డిమాం డ్ వినిపిస్తోంది. జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఆసుపత్రిలో ని కొందరు వైద్యులు, సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో వైద్యు లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
24 గంటల పాటు.. సాధారణం గా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు (Doctors) తమ సమస్యల పరిష్కారం కోసం వైద్య సేవలను నిలిపివేస్తుంటారు. కానీ కోల్‌కతా ఘటనపై ప్రయివేట్ ఆసుపత్రుల వైద్యులు 24 గంటల పాటు ఓపీ సేవలను నిలిపివేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణలో అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోతాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తోంది. కోల్‌కతా ఘటన అత్యంత హేయమని, బాధ్యులను ఇప్పటిరవకు గుర్తించకపోవడం, వైద్యులకు తగిన భద్రత, రక్షణ లేకపోవడం అన్యాయమని ఐఎంఏ నాయకులు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు.
వైద్యుల ధర్నా.. హైదరాబాద్ ఇందిరాపార్క్‌లోని (At Indira Park, Hyderabad) ధర్నాచౌక్‌లో ఐఎంఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వ హించారు. తెలంగాణ వ్యాప్తంగా పలు పట్టణాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నిరసన ప్రదర్శనలు చేశా రు. కోల్‌కతా ఘటనపై సీబీఐ విచా రణను వేగవంతం చేసి నిందితులం దరినీ అరెస్ట్ చేయాలని వైద్య సంఘా లు డిమాండ్ చేస్తున్నాయి. ఐఎంఏ పిలుపుతో శనివారం ఉద యం 6గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలను నిలిపి వేస్తున్నట్లు రాష్ట్రం లోని ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రు లు ప్రకటించాయి. అపోలో, కిమ్స్, స్టార్, యశోద, రెయిన్‌బో, కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రులు (Apollo, Kims, Star, Yashoda, Rainbow, Kims Sunshine Hospitals) సహా వివిధ ఆసుపత్రుల్లో 24 గంటలపాటు ఓపీ ఉండబోదని, ఎమర్జెన్సీ సేవలు అందిస్తామని వెల్లడించాయి.