–ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ
MRPS Mandakrishna Madiga : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పేదల సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశా రు. ఆగష్టు 13న ఎల్ బి స్టేడియం లో చలో హైదరాబాద్ కు సంబం ధించి జిల్లా సన్నాహక సభ బుధ వారం వారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరెడ్ మేట్ లో నిర్వహించా రు. సభకు ముఖ్య అతిథిగా హాజ రైన మందకృష్ణ మాదిగ మాట్లాడు తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభు త్వం ఏర్పడి 20నెలలు గడిచినా పే ద ప్రజలకు ఇచ్చిన హామీలు నెర వేర్చడం లేదని ఆవేదన వ్యక్తంచేశా రు.
తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణ త వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వా లని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.అధికారపక్షం అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం నోరు విప్పడం లే దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ క్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మే రకు సామాజిక పింఛన్ రూ.4వేలు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలు, తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీ ణత వ్యాధిగ్రస్తులకు రూ.15 వేల పెన్షన్‌ను మంజూరు చేసి హామీ ఇచ్చిన రోజు నుంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు ఆరో గ్యశ్రీ కానీ, వృద్ధాప్య పింఛన్, వి తం తు పింఛన్, నాలుగు కిలోల నుండి ఆరు కిలోల వరకు పేదలకు బి య్యం ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలి తమే అని మందకృష్ణ మాదిగ పే ర్కొన్నారు.
నాలుగైదు సంవత్సరాల నుండి విక లాంగులకు కొత్త పింఛన్ ఇవ్వటం లేదని, వెంటనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వచ్చి న హామీలు పక్క రాష్ట్రమైన ఆం ధ్రప్రదేశ్ లో అమలు జరుగుతున్నా మన తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. ప్రతి పక్షాలు కూడా ఈ విషయంలో నో రు మెదపడం లేదని, వారికి వచ్చే ఎలక్షన్ లో అనుకూలంగా ఉండేం దుకే మౌనంగా ఉంటున్నారని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వి న య్ కుమార్ తదితరులు పాల్గొ న్నారు.