–ఆన్ లైన్ లో సీఎంఆర్ఎఫ్ దర ఖాస్తుకు అవకాశం
–ప్రజాప్రతినిధులకు లాగిన్ ఐడీలు కేటాయింపు
–దరఖాస్తు అప్డేట్ తెలుసుకునే సదుపాయం
–నిషిత పరిశీలన తర్వాతే ముఖ్య మంత్రి సహాయ నిధి సాయం
CM Relief Fund: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) (CM Relief Fund)కింద సా యాన్ని మరింత చేరువ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం (State Govt). సీఎంఆర్ఎఫ్ ను పారదర్శకంగా అందించేందుకు ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానం సోమవారం నుంచి అందుబా టులోకి రానుంది. ఇకపై సీఎం ఆర్‌ఎఫ్ (CMRF) ద్వారా ఆర్థిక సాయం పొం దాలనుకునేవారు ఆన్‌లైన్‌లోనే దర ఖాస్తులను సమర్పించాల్సి ఉంటుం ది. ఈ మేరకు ప్రభుత్వం ఈ విభా గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఇందు కు సంబంధించి సీఎంఆర్ ఎఫ్ వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 2న ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల సర్వర్‌లతోపాటు క్షేత్రస్థాయిలో తహసీల్దార్‌లు జారీ చేసే ఆదాయ ధ్రువపత్రాలకు సంబంధించిన సర్వర్‌తోనూ సీఎంఆర్‌ఎఫ్‌ను ప్రభుత్వం అనుసంధానం చేసింది.
సీఎంఆర్‌ఎఫ్ (CMRF) కింద గతంలో కేవలం 2వేల ఆస్పత్రులు మాత్రమే ఉండగా, తాజాగా దాదాపు 4వేల ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా.. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు నమ్మదగినవేనా, ఏవైనా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారా.. అనే వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక విధానాన్ని సర్వర్‌లో ఏర్పాటుచేశారు. సీఎంఆర్‌ఎఫ్ కింద సాయం పొందాలనుకు న్నవారు.. ఇకపై ప్రభుత్వాన్ని, సీఎంఆర్‌ఎఫ్ అధికారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆ ప్రాంత ఎమ్మెల్యే లేదా, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీని (MLA or Minister, MP, MLC) సంప్రదిస్తే సరిపో తుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఒక లాగిన్ ఐడీని కేటాయించింది. దీని ద్వారా వారి వద్దకు వచ్చే పేషంట్ల వివరాలను సీఎంఆర్‌ఎఫ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు.తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక విధానాన్ని సర్వర్‌లో ఏర్పాటుచేశారు. సీఎంఆర్‌ఎఫ్ కింద సాయం పొందాలనుకున్నవారు.. ఇకపై ప్రభుత్వాన్ని, సీఎంఆర్‌ఎఫ్ అధికారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆ ప్రాంత ఎమ్మెల్యే లేదా, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీని (MLA or Minister, MP, MLC)సంప్రదిస్తే సరిపోతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఒక లాగిన్ ఐడీని కేటాయించింది. దీని ద్వారా వారి వద్దకు వచ్చే పేషంట్ల వివరాలను సీఎంఆర్‌ఎఫ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు.దరఖాస్తులపై లోతైన విచారణ
సీఎంఆర్‌ఎఫ్ కోసం వచ్చిన దరఖాస్తులపైౖ ప్రభుత్వం 360 డిగ్రీల కోణంలో విచారణ చేయనుంది. ఇందుకోసం ఆన్‌లైన్ పోర్టల్‌కు.. రాష్ట్రంలోని ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులను (Aadhaar, Ration, Arogyashri cards)పర్యవేక్షించే సర్వర్‌లను అనుసంధానం చేసింది. తహసీల్దార్లు జారీ చేసే ధ్రువపత్రాలను మీ–సేవల సహాయంతో పరిశీలించనున్నారు. దరఖాస్తుల విచారణలో భాగంగా పేషంట్ తీసుకున్న చికిత్స, అందుకు అయిన ఖర్చును ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులతో మాట్లాడి మరోసారి వివరాలు తెలుసుకుంటారు. పేషంట్ ఇచ్చిన వివరాలు, ఆస్పత్రి తెలిపిన వివరాలు సరిగా ఉన్న దరఖాస్తులకు ఆమోదం తెలుపుతారు. అనంతరం దరఖాస్తుదారుడికి ఎంతమేర సాయం అందించాలన్న వివరాలు కూడా ఆన్‌లైన్‌లోనే (online) తెలుస్తాయి. దాని ప్రకారం లబ్ధిదారుడి పేరిట చెక్కు మంజూరు చేస్తారు. కాగా, సీఎంఆర్‌ఎఫ్ సాయం కోసం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 6 నెలల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.