–తెలుగు రాష్ట్రాల చిక్కుముళ్లు తెగదెంపులు చేద్దాం
–ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు టి. సిఎం రేవంత్ చకచకా సమాధానం
–ఈనెల ఆరవ తేదీన భేటీకి ఇరు రాష్ట్రాల సీఎంల అంగీకారం
–సమావేశానికి రావాలంటూ బాబు లేఖకు రేవంత్ ప్రతి లేఖలో స్పష్టం
–పదేళ్లుగా అపరిష్కృతంగా సమ స్యలకు తాజా భేటీతో పరిష్కారం
–ఇద్దరు సీఎంల భేటీ లో ఎజెండాపై మంత్రులతో రేవంత్ చర్చలు
CM Revanth- Chandrababu Naidu: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మంచి చెడుల గురించి మాట్లాడుకుందాం రా అంటూ ఉభ య రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడం శుభ పరిణా మంగా సర్వత్ర అభిప్రాయం వ్యక్త మవుతోంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ప్రయత్నా నికి అడుగులు పడ్డాయి. సుహృ ద్భావ వాతావరణంలో పరస్పర ఆమోదంతో సమస్యలను పరిష్క రించుకునే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు కదులుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి న నేపథ్యంలో చిరకాలంగా పేరుకు పోయిన చిక్కుముళ్లను తెగదెంపు లు చేసేందుకు అడుగులు ముందు కు పడుతున్నాయి. తెలంగాణ ము ఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (CM Revanth), ఆంధ్రప్రదే శ్ సీఎం ఎన్.చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఈ నెల 6న సమావేశం కావాలని నిర్ణయించారు. విభజన సమస్యల పై సమావేశమవుదామంటూ చంద్ర బాబు రాసినపట్ల రేవంత్‌రెడ్డి సాను కూలంగా స్పందించారు. చంద్రబా బు చేసిన ప్రతిపాదనకు అంగీకరి స్తూ బేగంపేటలోని మహాత్మ జ్యోతి రావు పూలే ప్రజాభవన్‌లో సమా వేశమవుదామంటూ సమాచారమి చ్చారు. సమావేశానికి రావాల్సింది గా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ భేటీలో చర్చించాల్సిన ఎజెం డా, విధివిధానాల ఖరారుపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మంగళవారం సచివాల యంలో సమావేశమయ్యారు. విభ జన సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు. మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇం దులో పాల్గొన్నారు. కాగా, ఇరువు రు సీఎంల సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు అధికారు లు ఏర్పాట్లతో పాటు భేటీకి అవస రమైన ఎజెండానూ రూపొందిస్తు న్నారు. ఈ నెల 6న మధ్యాహ్నం తర్వాత సమావేశం ప్రారంభం కానుంది.
చిరకాలంగా చిక్కుముళ్ళు..
ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయి జూన్ 2తో పదేళ్లు గడి చినా ప్రధాన సమస్యలు అపరిష్కృ తంగానే ఉండిపోయాయి. ఆంధ్రప్ర దేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–20 14లోని సంస్థలు, వాటి ఆస్తులు, అప్పులు, నిధుల పంపిణీ (Distribution of assets, liabilities and funds)ఎటూ తేలలేదు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యం లో ఇరు రాష్ట్రాల అధికారులతో పలుమార్లు సమావేశాలు జరిగినా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగినా పరిష్కారా నికి నోచుకోలేదు. కొన్ని సంస్థలకు సంబంధించి పరస్పర అంగీకారం కుదిరినా విభజన కాగితాలపై రెం డు రాష్ట్రాలు సంతకాలు చేయలే దు. కొన్ని కీలక సమస్యలు అపెక్స్ కౌన్సిల్ ద్వారానే పరిష్కారమవుతా యని తెలిసినా అందులో సభ్యులై న ఇరు రాష్ట్రాల సీఎంలు (cms)మాత్రం చొరవ చూపలేకపోయారు. అప్ప ట్లో సీఎంలు కేసీఆర్, జగన్ హాయ్ బాయ్ సమావేశాలు నిర్వహించారే తప్ప ఒక్క సమస్యను కూడా నిగ్గు తేల్చలేకపోయారన్న విమర్శలున్నా యి. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొ న్నందున కొన్ని సమస్యలైనా పరి ష్కారమవుతాయన్న అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి.
పెండింగ్ సమస్యలు ఇలా..
సీఐడీ హెడ్ క్వార్టర్స్, లేక్‌వ్యూ అతిథి గృహం, హెర్మిటేజ్ కార్యాలయ భవనం (Headquarters, Lakeview Guest House, Hermitage Office Building మినహా మిగిలిన అన్ని భవనాలను తెలంగాణకు అప్ప గించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ లేఖ రాసింది. దీనిపై తెలంగాణ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పాత సెక్రటేరియట్‌లో ఉన్న భవనాలు, స్థ లాన్ని, అసెంబ్లీ ప్రాంగణంలోని శాస నసభ, శాసనమండలి భవనాలను 2019లోనే తెలంగాణకు ఏపీ అప్ప గించింది. సీఐడీ హెడ్ క్వార్టర్స్, లేక్‌వ్యూ అతిథి గృహం వంటి వాటిని జనాభా దామాషా ప్రకారం 58.32, 41.68 పద్ధతిన పంచాలని ఏపీ కోరుతోంది. కాగా, 9వ షెడ్యూ లులో కేంద్రం చేర్చిన మొత్తం 91 సంస్థలకు చెందిన ఆస్తులు, అప్పు లు, నగదు నిల్వలు, ఉద్యోగులను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభు త్వం షీలా భిడే కమిటీని వేసింది. ఇందులో 68 సంస్థలపై తమకు ఎలాంటి అభ్యoతరాలు లేవని తెలంగాణ తెలిపింది. మిగతా 23 సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రా ల మధ్య పేచీ నెలకొంది. ఇందులో ప్రధానంగా ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీజెన్‌కో, ఏపీట్రాన్స్‌కో వంటి సంస్థల ఆస్తుల పై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ అంశం ఇరువురు సీఎంల సమా వేశంలో చర్చకు వస్తుందని సమా చారం. ఇక 10వ షెడ్యూలులో విద్య, శిక్షణ, మానవవనరుల అభి వృద్ధి సంస్థలు, వర్సిటీలు వంటి మొత్తం 142 సంస్థలున్నాయి. వీటి అస్తుల విలువ రూ.38 వేల కోట్లు గా అంచనా వేశారు. ఈ షెడ్యూలు లో మర్రి చెన్నారెడ్డి (Marri Chenna Reddy)మానవ వనరు ల అభివృద్ధి సంస్థ, ఏఎంఆర్‌ఏపీ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, పోలీస్ అకాడమీ, ఏపీ ఎక్సైజ్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఇంటర్మీడియట్ బోర్డు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వంటి సంస్థలున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వంటివి పదో షెడ్యూలు కిందనే ఉన్నాయి. వీటిలో తెలుగు అకాడమీ, అంబ్కేదర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థలపై వివాదాలున్నాయి. కాగా, ఉన్నత విద్యామండలి ఆస్తుల విలువ తేలడం లేదు. దీనికి సంబంధించిన రూ.800 కోట్ల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. సమస్యలన్నీ ఒకే భేటీతో పరిష్కారం కాకపోయినా మొత్తానికి పరిష్కారానికి సుగమ మార్గం పడిందని చెప్పవచ్చు.