CM Revanth : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎను ము ల రేవంత్ రెడ్డి గురువారం సా యంత్రం కీలక సమావేశం నిర్వ హించారు. అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్ప న్న మైన పరిస్థితులను ఎదుర్కొ న డానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధి కారులను ఆదేశించారు. భారీ వ ర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురుగాలుల కారణంగా తలె త్తిన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందు లు పడకుండా తక్షణ సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధి కారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పు డు సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రదేశా ల్లో వెంటనే తగిన చర్యలు తీసుకో వాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుం డా, విద్యుత్ అంతరాయాలు లే కుండా జీహెచ్ఎంసీ, పోలీసు, హై డ్రా విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను ప రిష్కరించి సరఫరాను పునరు ద్ధరించాలని చెప్పారు. జలమయ మైన కాలనీల్లో ప్రజలకు అవసర మైన సహాయక చర్యలు చేపట్టా లని అన్నారు. పోలీసులు క్షేత్రస్థా యిలో ఉండి ట్రాఫిక్ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించాలని చెప్పారు.
పలు జిల్లాల్లో కూడా వర్షాలు, ఈ దురుగాలులు, వడగండ్లు పడుతు న్నందున జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం, ఇతర అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండా లని ఆదేశించారు.