Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక ఆదేశం, కాలు ష్యరహిత హైదరాబాద్‌కు అవసర మైన సంస్కరణలు చేపట్టండి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన సం స్కరణలు చేపట్టాలని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ సి టీ ఏరియాలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని స్పష్టం చేశారు.

పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌పై ముఖ్య‌మంత్రి గారు క‌మాండ్ కంట్రో ల్ సెంట‌ర్‌లో ఉన్నతస్థాయి సమావే శం నిర్వహించారు. కాలుష్య రహి తంగా మార్చే ప్రణాళికలతో పాటు పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, మూసీ రివర్ ఫ్రంట్, మిరాలం ట్యాం క్ ప్రాంతాన్ని పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రి స మీక్షించారు.విప‌రీత‌మైన కాలు ష్యంతో ఢిల్లీ, ముంబ‌యి, చెన్నై వంటి న‌గ‌రాల్లో ప్ర‌జ‌లు ప‌లు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నార‌ని, అలాం టి ప‌రిస్థితి హైద‌రాబాద్ న‌గ‌రంలో త‌లెత్త‌కూడ‌ద‌ని అన్నారు.

న‌గ‌రాన్ని కాలుష్య‌ ర‌హితంగా మా ర్చడంతో పాటు 25 ఏళ్ల అవ‌స‌రాల‌ కు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలని ముఖ్య‌మంత్రి సూచిం చారు. ఆ ప్రణాళికలు రూపొందించ డంలో ఆయా మహానగరాల్లో ఎ దురవుతున్న స‌మ‌స్య‌ల‌ను అధ్య‌ య‌నం చేయాల‌ని పేర్కొన్నారు.
న‌గ‌రంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండ‌ర్ గ్రౌండ్ కేబులింగ్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని ఆయా శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. ఈ క్ర‌మంలో అన్ని శాఖ‌లు స‌మ‌గ్ర డీపీ ఆర్‌లు త‌యారు చేయాల‌న్నారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిం చాల‌ని, నిర్మాణ రంగ వ్య‌ర్థాల‌ను సిటీలో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ డంప్ చేయ‌కుండా చూడాల‌ని నిఘా పె ట్టాలని చెప్పారు.ఉద్దేశ‌పూర్వ‌కంగా అలా చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.హైద‌రాబాద్ న‌గ‌రంలో మంచినీటి స‌ర‌ఫ‌రా, ము రుగు నీటి పారుదల వ్య‌వ‌స్థ‌ను పూ ర్తిగా సంస్క‌రించాలి. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందేలా హైద‌రా బాద్ న‌గ‌ర మంచినీటి స‌ర‌ఫ‌రా, సీవ‌రేజీ బోర్డు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించా లి. బోర్డు త‌మ‌కున్న వ‌న‌రుల‌ను ఏ విధంగా స‌ద్వినియోగం చేసుకోవా ల‌నే అంశంపై ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూ పొంచుకోవాలి.

ఓఆర్ఆర్ ప‌రిధిలోని వార‌స‌త్వ క‌ట్ట‌డాల సంర‌క్ష‌ణ‌, వాటిని ప‌ర్యాట‌ క ప్ర‌దేశాలుగా తీర్చిదిద్దేలా కులీకు తుబ్ షాహీ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌వ‌రిం చి దానిని మ‌రింత బ‌లోపేతం చే యాలి. పాత‌బ‌స్తీలో మెట్రో ప‌ను లకు అవ‌స‌ర‌మైన నిధులు ఇప్ప‌టికే విడుద‌ల చేసినందున అక్క‌డ మె ట్రో ప‌నులు వేగ‌వంతం చేయాలి. మెట్రో ఇత‌ర ఫేజ్‌ల అనుమ‌తులు, త‌దిత‌ర‌ విష‌యాల్లో ఏమాత్రం జా ప్యాన్ని స‌హించేది లేదు.

కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌తో స‌మ‌ న్వ‌యం చేసుకుంటూ త్వ‌ర‌గా ప‌ నులు ప‌ట్టాలెక్కేలా చూడాలి. ప్యారడైజ్ జంక్ష‌న్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్ వ‌ర‌కు ఎలివేటేడ్ కారిడార్ ప‌నులు వేగ‌వంతం చేయా లని చెప్పారు.

మూసీ రివ‌ర్ ఫ్రంట్‌కు సంబంధించి హిమాయ‌త్‌సాగ‌ర్ నుంచి గాంధీ స‌ రోవ‌ర్ వ‌ర‌కు ప‌నులు వేగ‌వంతం చే యాల‌ని అధికారుల‌ను ముఖ్యమం త్రి ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి మూసీ వైపు వ‌చ్చే క్ర‌మంలో కొత్వా ల్‌గూడ జంక్ష‌న్‌లో మూసీ రివ‌ర్ ఫ్రం ట్‌కు ప్ర‌తీకగా ఇండియా గేట్‌, గేట్ వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాం టి ప్రత్యేకత కలిగిన ఒక ల్యాండ్ మార్క్‌ను నిర్మించాల‌ని సూచించా రు. మూసీపైన బ్రిడ్జి కం బ్యారేజీ లకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాలి.

నెహ్రూ జూపార్క్‌, మీరాలం ట్యాంక్ అభివృద్ధి ప‌నుల్లో పురోగ‌తిపైనా ముఖ్యమంత్రి గారు స‌మీక్షించారు. జూ పార్క్‌, మీరాలం ట్యాంక్ స‌మీ పంలో ప‌ర్యాట‌కులు బ‌స చేసేందు కు వీలుగా అధునాత‌న వ‌స‌తుల‌ తో టూరిజం ప్లాజా నిర్మించాలని అభిప్రాయ‌ప‌డ్డారు.స‌మీక్ష‌లో ము ఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం నరేంద ర్ రెడ్డి తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.