power demand in Telangana : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, గత మెన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగింది
power demand in Telangana : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో గతమెన్నడూ లేనంతగా వి ద్యుత్తు డిమాండ్ విపరీతంగా పెరి గిందని, రాబోయే భవిష్యత్తు అం చనాలు, అవసరాలకు తగినట్లు గా విద్యుత్తు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదే శిoచారు. మునుపెన్నడూ లేని వి ధంగా రాష్ట్రానికి వెల్లువెత్తిన పెట్టు బడులు, రాబోయే రోజుల్లో తెలం గాణలో జరగబోయే పారిశ్రామిక అ భివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భ విష్యత్తు ప్రణాళిక తయారు చేసు కోవాలని దిశా నిర్దేశం చేశారు.
పరిశ్రమలతో పాటు గ్లోబల్ కెపా బులిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ (మెట్రో, ఎల క్ట్రికల్ వెహికిల్స్) దృష్టిలో ఉం చుకొని పునరుత్పాదక విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను ముందస్తుగా అం చ నా వేసి రోడ్ మ్యాప్ సిద్ధం చేసు కోవాలని అధికారులకు సూచిం చారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, టీజీ రెడ్కో ఎండీ అనిల ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభి వృద్ధి పనులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ల వల్ల వచ్చే మూడేండ్లలో విద్యు త్ డిమాండ్ పెరుగుతుందని ము ఖ్యమంత్రి అధికారులను అప్రమ త్తం చేశారు. భవిష్యత్తు అవసరా లకు అనుగుణంగా మూడేండ్ల వి ద్యుత్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవా లని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చే శారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8శాతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఇది ఒక గొప్ప విజయం. అయినప్పటికీ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుంది. 2025–26 లో 18,138 మెగావాట్లు, 2034.35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని భవిష్యత్తు అవసరాలు, అంచనా లను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నివేదించారు. పెరుగుతున్నవిద్యుత్తు అంచనా లకు సరిపడేలా విద్యుత్తు ఉత్పత్తి ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రధా నంగా క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ పైన దృష్టి సారించాలని అన్నారు. ప్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను సద్వి నియోగం చేసుకోవాలని, కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపైన దృష్టి సారించా లని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి లో ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.
రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలని, మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాల ను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాల ను పరిగణనలోకి తీసు కోవాలని, కొత్త గా ఏర్పాటు చేయ బోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచు కోవాలని చెప్పారు.
గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ల హబ్‌గా హైదరాబాద్ దేశంలో అందరి దృ ష్టిని ఆకర్షిస్తోందని అన్నారు. భవి ష్యత్తు లో డేటా సెంటర్ల హబ్ గా మారబోతుందని, హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతు న్నామని ముఖ్యమంత్రి అన్నారు.
అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజన ల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రో డ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావా ల్సిన విద్యుత్ అవసరాలపైన హె చ్ఎండీఎ తో సమన్వయం చేసు కోవాలని విద్యుత్తు శాఖ అధికా రులకు సూచించారు. క్షేత్రస్థాయి లో విద్యుత్ డిమాండ్ కు అనుగు ణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చే సుకోవాలి. విద్యుత్ లైన్ల ఆధునీక రణ పైన దృష్టి సారించాలని, ఫ్యూ చర్ సీటీ లో పూర్తి భూగర్భ విద్యు త్ లైన్లు ఏర్పాటు చేయాలని చె ప్పారు.
ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కని పిం చడానికి వీల్లేదని, హై టెన్షన్ లైన్ల ను కూడా అక్కడి నుంచి తరలిం చాల్సి ఉంటుందని గుర్తు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పా టు చేయాలని ముఖ్యమంత్రి అధి కారులకు సూచించారు. సెక్రెటే రియట్, నక్లెస్ రోడ్, కేబీఆర్ పా ర్కు వంటి ప్రాంతాల్లో ముందుగా ప్రయత్నించాలన్నారు. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ పొడ వునా సోలార్ విద్యుత్ వినియో గించుకునే ప్రణాళిక , జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలా ల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాల న్నారు.