–తొలి విడతలో 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ. లక్ష వరకు నిధులు జమ
— విడతలవారీగా 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రైతులకు (farmers) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన మాట ప్రకారమే రైతు రుణమాఫీని విడుదల చేశా రు. తొలి విడతలో 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ. లక్ష వరకు నిధులు జమ చేశారు. రైతుల ఖాతాల్లోకి (Account of Farmers)రూ. 7 వేల కోట్లు ను రెండో విడతలో ఈ నెలాఖ రులోపే రూ. లక్షన్నర విడుదల చేశారు. రుణమాఫీని ఆగస్టు దాట క ముందే రూ. 2 లక్షల రుణమాఫీ ని పూర్తి చేస్తామని సీఎం (cm)తెలిపారు. ప్రభుత్వం రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు ఖర్చు చేస్తున్న కాంగ్రె స్ ప్రభుత్వం రుణమాఫీ నిధులను వేరే అప్పులకు జమ చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.
భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.2 లక్షల రుణ మాఫీ పథకం వర్తిస్తుందని చెప్పా రు. కేవలం కుటుంబాన్ని నిర్ధా రించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణనలోకి తీసు కుంటామని, రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని సీఎం రేవంత్ (cm revanth)స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఫేస్ -1 కింద 18న రైతులకు లక్ష వరకు రుణ మాఫీ చేస్తుండడంతో ఘనంగా సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రంలోపు బ్యాంకుల్లో రుణమాఫీ నగదు జమ చేయగానే మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు.
రైతు కుటుంబాన్ని (farmers family)గుర్తించడానికి ఆహార భద్రతాకార్డు వివరాలు ప్రామాణికంగా రుణమాఫీ ఉంటుం దని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న షెడూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకా రం కేంద్ర బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తించనుంది. పథకం అమ లు కోసం ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించగా, ఆ అధికారి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్కు సమన్వ యకర్తగా వ్యహరించనున్నారు. డిసెంబరు 12, 2023 నాటికి రైతుకు ఉన్న రుణం, లేక రెండు లక్షల వరకు ఏది తక్కువైతే దాన్ని పొందేందుకు రైతులు అర్హులు. అలాగే రెండు లక్షల మించిన రుణం ఉన్న రైతులు ఆపైన ఉన్న రుణాన్ని మొదట చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన ఉండగా, ఆ తరువాతనే రుణమాఫీ (Loan waiver) పొందే వెసులుబాటు కల్పించింది.