Politicsతెలంగాణహైదరాబాద్

CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక ఆదేశo, యుద్ధ ప్రాతిపదికన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల భూసేకరణ పూర్తి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: పాల మూరు , రంగారెడ్డి ఎ త్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించా లని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనితో పా టు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా భూసేకర ణ ప్ర క్రియను త్వ రగా పూర్తి చేయాలని చెప్పారు. ముఖ్య మంత్రి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రు లు, శాసనసభ్యు లతో ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో సమావేశమ య్యారు. ఉమ్మ డి పాలమూరు జి ల్లాలోని సాగునీటి ప్రాజె క్టులకు సం బం ధించి ఈ సందర్భంగా ముఖ్య మంత్రి కీలక మైన సూచనలు చేశారు.

జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ ని ధుల విషయంలో జా ప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీ సుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. పెండింగ్ బి ల్లుల ను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉ మ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సం బంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వ హించి ప్రాజెక్టుల పురోగతి ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించా లని ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు జూ పల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రె డ్డి, జి. మధుసూదన్ రెడ్డి, టి. మే ఘా రెడ్డి, కె. రాజేశ్ రెడ్డి,వంశీ కృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృ ష్ణారావు పాల్గొన్నారు.

Related Articles

Back to top button