Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : తెలంగాణకు మహార్దశ, హైదరాబా ద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్

–రూ. 10వేల కోట్ల పెట్టుబడితో

–400 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు

–దావోస్ లో కొనసాగుతోన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనా మిక్ ఫోరం సదస్సులో తెలంగాణ లో పెట్టు బడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అక్కడ పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంటున్నది. ఏఐ రంగంలో ఆసియాలో పేరొందిన సంస్థ కంట్రోస్ ఎస్ రూ.10,000 కోట్ల పెట్టబడి పెట్టేందుకు ఆసక్తి చూపెట్టింది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కంట్రోస్ ఎస్ సంస్థ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి బృందంతో చర్చలు జరిపింది. ఈ మేరకు హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు తెలం గాణ ప్రభుత్వంతో ఆ సంస్థ ఎంవో యూ కుదుర్చుకుంది. అర్టిఫిషియ ల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ రూ.10,000 కోట్ల పెట్టు బడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంట ర్ నెలకొల్పబోతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3,600 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ డేటా సెంటర్ మరో మైలురాయిగా నిలుస్తుంద న్నారు. కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపు రెడ్డి మాట్లాడుతూ డేటా సెంటర్ల ఏర్పాటు తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ధి సాధి స్తాయని అన్నారు.

 

సిటీలో హెచ్సీఎల్ కొత్త టెక్ సెంటర్ ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్ హైద రాబాద్లో కొత్త టెక్ సెంటర్ ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి. విజయకుమార్ తో చర్చలు జరిపి ఎంవోయూ కుదుర్చుకున్నది. హై టెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీఎల్ న్యూ క్యాంపస్ ఏర్పాటు చేసేందు కు ఆసక్తి చూపింది. దీని ద్వారా 5 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించాలని హెచ్సీఎల్ ఎండీని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో హెచ్ సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపం చంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకున్నవన్నారు. కాగా కొత్త కేంద్రంతో హైదరాబాద్లో హెచ్సీఎల్ మొత్తం ఐదు సెంటర్లకు విస్తరించ నున్నది.