CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం, రెం డు రోజుల పాటు భారీ వర్షాలతో అధికారులు అలెర్ట్ గా ఉండాలి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో రానున్న రెండు రోజు ల పాటు భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖ లు అప్రమత్తంగా ఉండాలని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారు లను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్‌గా ఉండాలని అ ప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చెప్పా రు.
అవసరమైన పక్షంలో, లోతట్టు ప్రాం తాల్లో నివసించే ప్రజలను ముందు గానే సురక్షిత ప్రాంతాలకు తరలిం చి, పునరావాస కేంద్రాలను ఏర్పా టు చేయాలని ముఖ్యమంత్రి సూ చించారు.
అన్ని కాజ్‌వేలను పరిశీలించి, రోడ్ల పై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందుగానే ట్రాఫిక్‌ను నిలిపివేయాలని సూచించారు.
విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చ ర్యలు చేపట్టాలని అన్నారు. వేలా డుతున్న విద్యుత్ వైర్లను వెంటనే తొలగించి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
దసరా సెలవులు ఉన్నప్పటికీ, వి ద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్ర మత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్ల పైకి రావద్దని సూచించారు. హైదరా బాద్‌లో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, హెచ్ ఎండబ్ల్యూఎస్, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆ ర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉం డాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.