CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభి వృద్ధి లక్ష్యంగా చేపట్టిన పథకాలకు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (RIDF) కింద తగిన విధంగా సహకరించాలని ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాం కు (NABARD) నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్ వీని కోరారు. తక్కువ వడ్డీకి రుణాలను అందజేయాలని కోరారు.నాబార్డు చైర్మన్ షాజీ కృ ష్ణన్ వీ (Shaji Krishnan V)తో పాటు బ్యాంకు ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో సమావేశమైంది. తెలంగాణలో సహకార సొసైటీల ను బలోపేతం చేయడంతో పాటు కొత్తగా మరిన్ని సహకార సొసైటీ లను ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి అడిగారు.
మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని, స్వయం సహా యక సంఘాల మహిళా గ్రూపుల కు ప్రత్యేక పథకాన్ని రూపొందించా లని కోరారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధా నం చేయడం ద్వారా రాష్ట్రంలో మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి సహకరించాలని కోరారు.స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహ ణను కూడా నాబార్డుకు అనుసం ధానం చేయాలని సూచించారు. అలాగే కొత్త గ్రామ పంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చ ర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశా రు. నాబార్డు అమలు చేస్తున్న పథ కాల కింద ఈ ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన నిధులు మార్చ్ 31 లో గా ఉపయోగించుకోవాలని ఈ సం దర్భంగా ముఖ్యమంత్రి అధికారు లకు సూచించారు. నాబార్డు పరిధి లోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలని చెప్పారు.
కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భం గా నాబార్డు చైర్మన్ ముఖ్యమంత్రి తో ప్రస్తావించారు. ఈ సమావేశం లో తెలంగాణ వ్యవసాయ కమిష న్ చైర్మన్ కోదండ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.