CM Revanth Reddy: ప్రజా దీవెన, వనపర్తి: అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయ డానికి వనపర్తి జిల్లాలో ముఖ్యమం త్రి ఎనుముల రేవంత్ రెడ్డి విస్తృ తంగా పర్యటించారు.వనపర్తికి చేరుకున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముందుగా స్థానిక శ్రీ వెంకటే శ్వర స్వామి వారి ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు. స్వామి వా రికి పట్టువస్త్రాలు సమర్పించి ప్ర త్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆల య అభివృద్ధి పనులకు ముఖ్య మంత్రి శంకుస్థాపన చేశారు. ము ఖ్యమంత్రి వెంట మంత్రి దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డితో పా టు జిల్లాకు చెందిన ప్రజాప్రతిని ధులు ఉన్నారు.
జీవితంలో మరిచిపోలేని మ ధుర జ్ఞాపకాలు… ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నత పాఠశాల నుంచి జూనియర్ కాలేజీ పూర్త య్యే వరకు వనపర్తి పట్టణంలో విద్యను అభ్యసించిన కాలం నాటి ఎంతో మంది స్నేహితులు, విద్యా బోధన చేసిన గురువులను కలు సుకున్నారు. పాత మిత్రులు, పాఠా లు చెప్పిన ఆచార్యులను పలకరిం చారు.జిల్లాలో పలు అభివృద్ధి కా ర్యక్రమాలకు శంకుస్థాపన చేయ డానికి వనపర్తి చేరుకున్న ముఖ్య మంత్రి పట్టణంలో మిత్రమండలి ఏర్పాటు చేసిన ఆత్మీయ కార్యక్ర మంలో పాల్గొన్నారు. చిన్ననాటి మిత్రులు, గురువులతో కలిసి ఉల్లా సంగా గడిపారు. ఆనాటి జ్ఞాపకా లను నెమరువేసుకున్నారు. వారి తో కలిసి భోజనం చేశారు. ఫోటో లు దిగారు.అంతకుముందు రేవం త్ రెడ్డి తాను చదువుకునే రోజుల్లో అద్దెకు ఉన్న ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి వారి ఆనందానికి అవదులు లేవు. వారితో కొద్దిసేపు ఆప్యాయం గా గడిపారు. యోగక్షేమాలు తెలు సుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి తో తనకున్న చిరస్మరణీయమైన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన… వనపర్తి జి ల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమా లకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, కొత్త ఐటీ టవర్, కొత్త ప్రభు త్వ జనరల్ ఆసుపత్రి, జిల్లా పరిష త్ (బాలుర) పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాల నిర్మాణం, శ్రీ రంగా పురం దేవాలయం అభివృద్ది పను లు, పెబ్బేరులో 30 పడకల ఆసుప త్రి భవన నిర్మాణం, రాజానగరం – పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ భవనం, పట్టణంలో సీసీఆర్ రోడ్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇంచార్జి మంత్రి దామో దర రాజనర్సింహ, మంత్రులు జూ పల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టాల్స్ సందర్శన…. వనపర్తిలోని కేడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీ మైదా నంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సందర్శించారు. కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అలాగే, రుణమేళా,జాబ్ మేళా స్టాల్స్ ను సందర్శించిన సీ ఎం లబ్దిదారులకు చెక్కులు అం దజేశారు.