CM Revanth Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: సంక్షే మం, పెట్టుబడులు, ఉద్యోగా వకా శాల కల్పన, పర్యావరణ సమతు ల్యతను సాధిస్తూ ప్రజల జీవితా లను మెరుగుపరిచేందుకు ప్రజా ప్ర భుత్వం చేపట్టిన మిషన్‌లో భాగ స్వాములు కావాలని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చే శారు. పారదర్శకమైన సంస్కరణల తో తెలంగాణను అభివృద్ధి పథం లో నడిపించడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని చెప్పారు. అం దుకోసం తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా రాష్ట్ర గొప్పతనా న్ని, ప్రజల ఆకాంక్షలను ప్రపంచాని కి చాటాలని కోరారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ప్ర పంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన భారత్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని, సంక్షేమ పథకా లను, మరియు సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.
విద్యార్థులు, కార్మిక సంఘాలు, రై తులు, మహిళల నాయకత్వంలో దశాబ్దాల పాటు జరిగిన పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రా ష్ట్రంగా ఏర్పడింది. మొదటి దశా బ్దంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరక పోవడంతో ఏర్పడిన నిరాశను తొ లగించడానికి ప్రజా ప్రభుత్వం ఆ వర్గాల ఆశలను నెరవేర్చే స్పష్ట మైన లక్ష్యంతో పనిచేస్తోంది.
ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. 20 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల కుపైగా రైతులకు రుణమాఫీ చేసి దేశ చరిత్రలోనే అతిపెద్ద రుణమా ఫీ కార్యక్రమాన్ని అమలు చేశాం. సే ద్యానికి 24 గంటల ఉచిత విద్యు త్‌తో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 12 వేలు పం ట పెట్టుబడి సహాయం, భూమి లే ని వ్యవసాయ కార్మికుల కుటుంబా నికి కూడా రూ. 12 వేల మద్దతుని ప్రభుత్వం అందిస్తోంది.
ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు ప్రతి క్వింటాలుపై రూ. 500 అదనపు బోనస్ అందిస్తూ రైతాం గానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలు స్తున్నాం. యువతకు నైపుణ్యాల ను అందించేందుకు యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్శిటీని స్థా పించాం. గతంలో ఉద్యోగ నియా మకాలు లేని పరిస్థితిని సవరిస్తూ, ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది లోనే 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 5 లక్షల మంది యు వకులకు ఉపాధి అవకాశాలను క ల్పించబోతున్నాం.
దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌లలో పెట్టుబడి సమ్మిట్ల ద్వారా రాష్ట్రానికి రూ. 2. 5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆక ర్షించాం. వీటి ద్వారా ప్రైవేట్ రంగం లో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తు న్నాం. తెలంగాణ వేగంగా పెరుగు తున్న ఆర్థిక వ్యవస్థ, అత్యధిక స్వం త పన్ను వసూళ్లు, జీసీసీలు, డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో అభివృద్ధితో పాటు దేశం లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపా లని యత్నిస్తున్నాం.
తెలంగాణ సంస్కృతిలో మహిళల కు సమాన గౌరవం ఉండాలన్న ల క్ష్యంతో ఉచిత రవాణా సౌకర్యం క ల్పించాం. 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, రూ. 500 లకే గ్యా స్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బి య్యం అందిస్తున్నాం.
ప్రభుత్వం రాష్ట్రంలోని స్వయం స హాయక సంఘాల్లో 67 లక్షల మం ది సభ్యులను కోటికి పెంచడ మే కా కుండా వారిని కోటీశ్వరులను చే యాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. అందులో భాగంగా మహిళలకు సో లార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సు లు, పెట్రోల్ బంకులు, మరియు ప్రీ మియం రిటైల్ ఔట్‌లెట్లలో షాపు లు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, బ స్సులను కేటాయించడం వంటి అ నేక చర్యలు చేపట్టాం.
విద్య, ఆరోగ్యం ప్రాధాన్యతా రంగా లుగా ఎంచుకున్న ప్రభుత్వం రాజీ వ్ ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్సక య్యే ఖర్చును రూ. 10 లక్షలకు పెంచడం, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పటికే వెయ్యి కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాం.
కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరానికి విముక్తి కల్పించడానికి ప్రభుత్వం మూసీ పునరుజ్జీవ కార్య క్రమం చేపట్టింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిది ద్దేందుకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచ ర్ సిటీ నిర్మాణంతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ ప్రా జెక్టులు చేపట్టడం జరిగింది. ఓబీసీ జనగణన చేసి దేశంలోనే తొలి రా ష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పూర్తి చేయ డంలో కూడా దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణయే.
ప్రజల సమస్యలను నేరుగా విని ప రిష్కరించడానికి పారదర్శకమైన ప ద్ధతిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ని ర్వహిస్తున్నాం. గిగ్ వర్కర్ల సంక్షే మం కోసం సరికొత్త సంక్షేమ విధా నాన్ని రూపొందిస్తున్నామని ము ఖ్యమంత్రి వివరించారు.అనంతరం రెండు రోజుల పాటు జరిగిన సద స్సులో చర్చించిన వాటిల్లో 44 అం శాలతో కూడిన హైదరాబాద్ తీ ర్మానం విడుదల చేశారు.